‘మన రేటింగ్‌ కోసం పొర్లుదండాలు పెట్టాలిరా..!’

Sudheer Babu Sammohanam Movie Trailer Out - Sakshi

సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సమ్మోహనం. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా టీజర్‌ను లాంచ్‌ చేయించారు. చిరును ఇంటర్వ్యూ చేసి మెగా అభిమానులను అట్రాక్ట్‌ చేశాడు సుధీర్‌బాబు. సమ్మోహనం టీజర్‌ను చాలా కొత్తగా, గ్రాండ్‌ లొకేషన్స్‌లో చూపించేసరికి ప్రేక్షకుల్లో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. 

నేడు (గురువారం) సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సమ్మోహనం ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. కామెడీ, ప్రేమ, ఎమోషన్స్‌తో కూడుకున్న ఈ ట్రైలర్‌లో సుధీర్‌బాబు, హీరోయిన్‌ అదితీ రావు అందంగా కనిపించారు. ట్రైలర్‌లోనే సినిమా కథేంటో రివీల్‌ చేసినట్టుగా కనిపిస్తోంది. వివేక్‌ సాగర్‌ సంగీతమందించగా.. ఇంద్రగంటి మోషనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జూన్‌ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top