ఛాన్స్ అడిగినా ఇవ్వలేదు: స్పీల్బర్గ్ | Steven Spielberg was twice rejected as James Bond director | Sakshi
Sakshi News home page

ఛాన్స్ అడిగినా ఇవ్వలేదు: స్పీల్బర్గ్

Jul 19 2016 9:26 AM | Updated on Sep 4 2017 5:19 AM

ఛాన్స్ అడిగినా ఇవ్వలేదు: స్పీల్బర్గ్

ఛాన్స్ అడిగినా ఇవ్వలేదు: స్పీల్బర్గ్

ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ కు రెండుసార్లు జేమ్స్బాండ్ సినిమా అవకాశం చేజారింది.

లండన్: జేమ్స్బాండ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. అలాంటి సినిమాలకు డైరెక్షన్ చేయాలని ప్రతి దర్శకుడు అనుకుంటాడు. ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ కు రెండుసార్లు ఈ అవకాశం చేజారింది. బీబీసీ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

'నేను తీసిన జాస్ సినిమా పెద్ద హిట్టైన తర్వాత నిర్మాత కుబీ బ్రొకోలిని కలిశాను. జేమ్స్బాండ్ సినిమాకు డైరెక్షన్ చేస్తానని చెప్పాను. ఈ సినిమాను నేను తగనని వారు భావించారు. క్లోజ్ ఎన్కౌంటర్స్ సినిమా తర్వాత మరోసారి అవకాశం ఇవ్వాలని కోరినా నాకు ఛాన్స్ దక్కలేదు. రెండుసార్లు బాండ్ సినిమా కోసం ప్రయత్నించా. ఇప్పుడు నన్ను భరించలేరు. కాబట్టి మర్చిపోవాలని బ్రొకోలిని కోరుతున్నా'నని 69 ఏళ్ల స్పీల్బర్గ్ తెలిపారు.

ఒకవేళ జేమ్స్బాండ్ సినిమాల నుంచి డానియల్ క్రెయిగ్ తప్పుకుంటే 'లూథర్' స్టార్ ఐడ్రిస్ ఎల్బా తన ఫస్ట్ ఛాయిస్ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement