తమిళ చిత్ర ట్రైలర్ విడుదల చేసిన జక్కన్న | SS Rajamouli releases Siddharth's Jil Jung Juk trailer | Sakshi
Sakshi News home page

తమిళ చిత్ర ట్రైలర్ విడుదల చేసిన జక్కన్న

Jan 14 2016 8:58 PM | Updated on Sep 3 2017 3:41 PM

తమిళ చిత్ర ట్రైలర్ విడుదల చేసిన జక్కన్న

తమిళ చిత్ర ట్రైలర్ విడుదల చేసిన జక్కన్న

బొమ్మరిల్లు చిత్రంతో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న నటుడు సిద్ధార్థ్‌ కథానాయకుడుగా నటించిన 'జిల్‌ జంగ్‌ జక్' తమిళ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి విడుదల చేశారు.

చెన్నై: బొమ్మరిల్లు చిత్రంతో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న నటుడు సిద్ధార్థ్‌ కథానాయకుడుగా నటించిన 'జిల్‌ జంగ్‌ జక్' తమిళ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన కొన్ని ట్వీట్లు చేశారు. ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని అందులో పేర్కొన్నారు. ఇటీవల చెన్నైలో భారీ వర్షాలు కురిసి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సిద్ధార్థ్‌ వరద బాధితుల కోసం చాలా కృషి చేశారని రాజమౌళి ట్విట్లతో కొనియాడారు. సిద్ధార్థ్‌కు హాట్సాఫ్‌ చెబుతూ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement