రాజమౌళి మొదలెట్టేశారు..! | SS Rajamouli Next Film To Be Wrapped Up In Short Time | Sakshi
Sakshi News home page

Jun 8 2018 10:14 AM | Updated on Jul 14 2019 4:05 PM

SS Rajamouli Next Film To Be Wrapped Up In Short Time - Sakshi

బాహుబలి సిరీస్‌ తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న రాజమౌళి తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీ స్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు జక్కన్న. ఈ సినిమా షూటింగ్‌ అక్టోబర్‌లో ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పనులు రాజమౌళి ప్రారంభించినట్టుగా వార్తలు వస్తున్నాయి. బాహుబలి సినిమాకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన సాబు సిరిల్‌ ఈ చిత్రానికి కూడా పని చేయనున్నారు.

ఆయన సారధ్యంలో హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సెట్‌లో యాక్షన్‌ సీన్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. గత ఆరేడు నెలలుగా స్క్రిప్ట్‌ వర్క్‌లో బిజీగా ఉన్న రాజమౌళి ఇటీవల ఎన్టీఆర్‌, చెర్రీలకు పూర్తి స్క్రిప్ట్‌ వినిపించారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అరవింద సమేత, రామ్‌ చరణ్‌, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రాలు పూర్తయిన వెంటనే రాజమౌళి మల్టీస్టారర్‌ సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ భారీ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు జక్కన్న.

Advertisement
 
Advertisement
Advertisement