శ్రీదేవి సినిమాలే పాఠ్యాంశాలు..! | Sridevi Fan to open acting institute in her Honour | Sakshi
Sakshi News home page

Dec 9 2017 12:21 PM | Updated on Dec 9 2017 12:21 PM

Sridevi Fan to open acting institute in her Honour - Sakshi

అతిలోక సుందరి శ్రీదేవికి ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వంటి వారు తమ అభిమానాన్ని బహిరంగంగానే ప్రకటించగా ఓ వ్యాపారి తన రెస్టారెంట్ లో శ్రీదేవి నిలువెత్తు విగ్రహాన్ని ప్రతీష్టించుకున్నాడు. తాజాగా మరో అభిమానాన్ని తన శ్రీదేవిపై తన ప్రేమను చాటుకునేందుకు రెడీ అవుతున్నాడు. చెన్నై కి చెందిన అనీష్ నాయర్ అనే వ్యక్తి శ్రీదేవి పేరుతో  ఫిలిం ఇన్సిస్టిట్యూట్ లను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు.

2018లో ఒకేసారి చెన్నై హైదరాబాద్, ఢిల్లీ, కోల్ కత్తా, ముంబై, బెంగళూరులతో పాటు మరికొన్ని నగరాల్లో ఇన్సిస్టిట్యూట్ ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఇన్సిస్టిట్యూట్ లో పాఠాలుగా కేవలం శ్రీదేవి నటించిన సినిమాల్లోని సన్నివేశాలను మాత్రమే చూపించనున్నారట. అంతేకాదు డబ్బులేని కారణంగా సినిమాల్లోకి రాలేకపోతున్న ఔత్సాహికులకు ఈ ఇన్సిస్టిట్యూట్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారట. ఇప్పటికే అనీష్ నాయర్ స్వయంగా శ్రీదేవిని కలిసి ఇన్సిస్టిట్యూట్ కు ఆమె పేరు పెట్టేందుకు అనుమతి కూడా తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement