శ్రియకు పెళ్లా | South sensation Shriya Saran to marry Russian boyfriend in March? | Sakshi
Sakshi News home page

శ్రియకు పెళ్లా

Feb 9 2018 4:25 AM | Updated on Oct 22 2018 6:05 PM

South sensation Shriya Saran to marry Russian boyfriend in March? - Sakshi

శ్రియ

తమిళసినిమా:  నటి శ్రియకు పెళ్లంట. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వార్త ఇదే. నటిగా ఈ ఉత్తరాది భామ వయసు 15 ఏళ్లు. ఇష్టం చిత్రంతో టాలీవుడ్‌కు, ఉనక్కు 20 ఎనక్కు 18 చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన శ్రియ ఆ తరువాత ఈ రెండు భాషల్లోనూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ అగ్రనటిగా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో చాలా తక్కువ కాలంలోనే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో శివాజీ చిత్రంలో జోడీ కట్టే అవకాశాన్ని దక్కించుకున్న నటి శ్రియ. అలా విజయ్, విశాల్, ధనుష్‌ అంటూ స్టార్‌ హీరోలందరితోనూ వరుస పెట్టి నటించేసింది.

అదే విధంగా తెలుగులోనూ చిరంజీవి నుంచి ప్రముఖ నటులందరితోనూ నటించి విజయాలను తన ఖాతోలో వేసుకుంది. హిందీలోనూ గుర్తింపు పొందిన శ్రియకు పెళ్లి గడియలు ముంచుకొచ్చేస్తున్నాయని, మార్చిలోనే రష్యాకు చెందిన తన బాయ్‌ఫ్రెండ్‌తో పీపీపీ..డుండుండుంకు రెడీ అయిపోతుందనే ప్రచారం హోరెత్తుతోంది. అయితే శ్రియ పెళ్లి చేసుకోబోతోందన్న ప్రచారాన్ని ఆమె తల్లి నీర్జ ఖండించింది. ఈమె ఒక ఆంగ్లపత్రికకు ఇచ్చిన భేటీలో శ్రియ పెళ్లి వార్తలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.

శ్రియ ప్రస్తుతం తమిళం, తెలుగు భాషా చిత్రాలతో బిజీగా ఉందని చెప్పారు. అయితే రాజస్థాన్‌లోని తన మిత్రుడి పెళ్లికి వెళ్లిందని, అందులో భాగంగా ఒక డిజైనర్‌కు ప్రత్యేకంగా జ్యువెలరీ, డ్రస్‌ను తయారు చేయడానికి ఆర్డర్‌ చేసిందని, దీంతో తన పెళ్లికే ఈ జ్యువెలరీ, డ్రస్‌ను ఆర్డర్‌ చేసిందని భావించి నెటిజన్లు పెళ్లి ప్రచారం చేస్తున్నారని వివరించారు. అలాంటి ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని శ్రియతల్లి నీర్జ పేర్కొన్నారు. శ్రియ నటించిన తెలుగు చిత్రం గాయత్రి శుక్రవారం తెరపైకి రానుంది. తమిళంలో అరవిందస్వామితో కలిసి నరకాసురన్‌ చిత్రంలో నటిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement