ఆటాడిస్తా!

Sonu Sood to play Pullela Gopichand in PV Sindhu biopic - Sakshi

బ్యాడ్మింటన్‌ గేమ్‌ రూల్స్‌ తెలుసుకుంటున్నారు సోనూ సూద్‌. ఎందుకంటే త్వరలో బ్యాడ్మింటన్‌ కోర్టులో ప్లేయర్స్‌తో ఆట ఆడిస్తారట. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, ఒలింపిక్‌ సిల్వర్‌ మెడల్‌ విజేత పీవీ సింధు జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని సోనూ సూద్‌ నిర్మిస్తారు. అలాగే ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ పాత్రలో కూడా నటించనున్నారు. గోపీచంద్‌ దగ్గర పీవీ సింధు బ్యాడ్మింటన్‌ నేర్చుకున్న విషయం తెలిసిందే.

‘‘గోపీచంద్‌ పాత్రలో నటించడాన్ని గౌరవంగా ఫీల్‌ అవుతున్నాను. ఈ విషయం గురించి గోపీచంద్‌గారితో మాట్లాడాను’’ అని పేర్కొన్నారు సోనూ సూద్‌. పీవీ సింధు పాత్రలో దీపికా పదుకోన్‌ నటించబోతున్నరనే వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని, త్వరలో ప్రకటిస్తామని సోనూ సూద్‌ పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... పుల్లెల గోపీచంద్‌ జీవితం ఆధారంగా తెలుగు, హిందీలో తీయనున్న చిత్రంలో సుధీర్‌బాబు నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top