సోనంపై రహస్య చిత్రీకరణ | Sonam Preet Secret camera scenes shot | Sakshi
Sakshi News home page

సోనంపై రహస్య చిత్రీకరణ

May 4 2014 11:58 PM | Updated on Sep 2 2017 6:55 AM

తమిళ చిత్ర రంగానికి వచ్చిన పంజాబీ నటి సోనం ప్రీత్ నటించిన సన్నివేశాన్ని రహస్యంగా కెమెరా దాచి చిత్రీకరణ జరిపారు. దీని గురించి ఁకప్పల్‌రూ.

తమిళ చిత్ర రంగానికి వచ్చిన పంజాబీ నటి సోనం ప్రీత్ నటించిన సన్నివేశాన్ని రహస్యంగా కెమెరా దాచి చిత్రీకరణ జరిపారు. దీని గురించి ఁకప్పల్‌రూ. చిత్ర దర్శకుడు కార్తిక్ జి.గిరీష్ మాట్లాడుతూ ఁముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా అనే పాటలో మూళ్గాదా షిష్పే ఫ్రెండిప్పా అనే వాక్యం వస్తుందని, అందులో స్నేహాన్ని ఒక ఓడతో గీత రచయిత పోల్చినట్లు వివరించారు.  ఈ చిత్రంలో ఓడ ఎక్కడా కనిపించదన్నారు. ఇందులో హీరోగా వైభవ్, హీరోయిన్‌గా సోనం ప్రీత్ బజ్వా నటిస్తున్నారని చెప్పారు.
 
 ఈమె పంజాబీలో బెస్ట్ ఆఫ్ లక్ అనే చిత్రంలో నటించారని తెలిపారు. ఈమె ఉత్తరాఖండ్‌కు చెందినదన్నారు. ఈ చిత్రంలో విడివి గణేష్, కరుణాకరన్, ఆర్జునన్, నందకుమార్, శంకర్ నటిస్తున్నట్లు తెలిపారు. దినేష్ కృష్ణన్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నట్లు తెలిపారు. నటరాజన్ శంకరన్ సంగీతం సమకూరుస్తున్నారన్నారు. ఈ చిత్రం షూటింగ్ చెన్నై నొచ్చికుప్పం, సెంట్రల్ రైల్వే స్టేషన్ వంటి చోట్ల జరిగిందన్నారు. అక్కడ షూటింగ్ జరిగినట్లు ఎవరికీ తెలియదన్నారు. మినీ కెమెరాను దాచి చిత్రీకరణ జరిపామన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement