చాలెంజింగ్‌ పాత్ర.. | Soha Ali Khan to produce Ram Jethmalani Biopic | Sakshi
Sakshi News home page

తెరపైకి జెఠ్మలానీ జీవితం!

Dec 26 2017 7:28 PM | Updated on Dec 26 2017 7:56 PM

Soha Ali Khan to produce Ram Jethmalani Biopic - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప‍్రముఖ న్యాయవాది రాం జెఠ‍్మలానీ జీవితకథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతున్నది. ప్రముఖ నటి సోహా అలి ఖాన్‌ తన భర్త కునాల్‌ కెముతో కలసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ‘రెనగెడ్‌ ఫిల్మ్స్’ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి రోనీ స్క్రూవాలా సహ నిర్మాత. ఈ సినిమాలో కునాల్‌ కేము రాం జెఠ్మలానీ పాత్రను చేయబోతున్నారు. ఎంతో చాలెంజ్‌గా తీసుకొని.. ఈ సినిమా తెరకెక్కిస్తున్నామని సోహా అలీఖాన్‌ తెలిపారు.

జెఠ్మాలనీ వయసు ప్రస్తుతం 94 ఏళ్లు అని, ఆయన తన 70 ఏళ్ల వృత్తిజీవితంలో ప్రముఖ రాజకీయ నాయకుల నుంచి కరుడుగట్టిన నేరస్తుల వరకు ఎన్నో సంచలన కేసులను వాదించారని చెప్పారు. అంత గొప్ప వ్యక్తి  పూర్తి జీవితాన్ని తాము కేవలం  రెండున్నర గంటల్లో  చెప్పలేకపోవచ్చు, కానీ ముఖ్యమైన అంశాలను తెరకెక్కిస్తామన్నారు. స్క్రిప్ట్‌, దర్శకుడు ఫైనల్‌ అవ్వగానే సెట్స్‌ మీదకు వెళ్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement