జాకీచాన్‌తో తెలుగమ్మాయి? | Sobhita Dhulipala To Work With Jackie Chan? | Sakshi
Sakshi News home page

జాకీచాన్‌తో తెలుగమ్మాయి?

Aug 30 2016 2:16 AM | Updated on Sep 4 2017 11:26 AM

జాకీచాన్‌తో తెలుగమ్మాయి?

జాకీచాన్‌తో తెలుగమ్మాయి?

ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనే, దిశా పటాని, అమైరా దస్తూర్.. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న ఇండియన్ హీరోయిన్లు.

 ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనే, దిశా పటాని, అమైరా దస్తూర్.. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న ఇండియన్ హీరోయిన్లు. ఈ జాబితాలో త్వరలోనే ఓ తెలుగుమ్మాయ్ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయ్. చైనీస్ సూపర్‌స్టార్ జాకీ చాన్ ‘స్కిప్‌ట్రేస్-2’ అనే సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాలో ఇండియన్ హీరోయిన్లనే ఎంపిక చేయమని జాకీచాన్ కండీషన్ పెట్టారట. దాంతో దర్శక - నిర్మాతలు ఆ పనిలో పడ్డారు.
 
 ‘రమణ్ రాఘవ్ 2.0’తో హిందీలో హీరోయిన్‌గా పరిచయమైన తెలుగమ్మాయ్ శోభితా ధూళిపాళతో పాటు తిలోత్తమ షోమెలను ఆడిషన్ చేశారు. శోభితా ధూళిపాళ దాదాపు ఖాయమైనట్లేనట. అయితే, ఇంకా సంతకం చేయలేదంటున్నారు. ‘ది మిత్’లో మల్లికా శెరావత్, ‘కుంగ్ ఫూ యోగా’లో దిశా పటాని, అమైరా దస్తూర్‌లకు జాకీ అవకాశం ఇచ్చారు. 2013లో ‘మిస్ ఇండియా ఎర్త్’ కిరీటం సొంతం చేసుకున్న శోభిత పుట్టింది గుంటూరులో, పెరిగింది విశాఖలో. ‘రమణ్ రాఘవ్ 2.0’లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement