ఈ పోస్టర్లోని నటుణ్ని గుర్తుపట్టగలరా..? | sj suriya nenjam marappathillai poster | Sakshi
Sakshi News home page

ఈ పోస్టర్లోని నటుణ్ని గుర్తుపట్టగలరా..?

Jun 21 2016 11:53 AM | Updated on Sep 4 2017 3:02 AM

ఈ పోస్టర్లోని నటుణ్ని గుర్తుపట్టగలరా..?

ఈ పోస్టర్లోని నటుణ్ని గుర్తుపట్టగలరా..?

రాక్ స్టార్లా కనిపిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా..? ప్రస్తుతం టాలీవుడ్ ఈ హీరో కం డైరెక్టర్ పేరు తెగ వినిపిస్తోంది. ఓ స్టార్ హీరో సినిమాను డైరెక్ట్ చేసే చాన్స్ వచ్చినట్టుగానే వచ్చి మిస్...

రాక్ స్టార్లా కనిపిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా..? ప్రస్తుతం  టాలీవుడ్ ఈ హీరో కం డైరెక్టర్ పేరు తెగ వినిపిస్తోంది. ఓ స్టార్ హీరో సినిమాను డైరెక్ట్ చేసే చాన్స్ వచ్చినట్టుగానే వచ్చి మిస్ అయ్యింది. అదే సమయంలో మరోస్టార్ హీరో సినిమాలో విలన్గా నటించనున్నాడు. ఇలా టాప్ స్టార్స్తో డీల్ చేస్తున్న ఈ ఆర్టిస్ట్ ఎవరో కాదండి తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య.



ఎస్ జె సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన నెంజం మరప్పదిల్లై సినిమా పోస్టర్ ఇది. వర్ణ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సెల్వ, సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ జానర్ అనిపించుకున్న హర్రర్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎస్ జె సూర్యతో డిఫరెంట్ గెటప్ వేయించి సెల్వ ఆ లుక్తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. మరో దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎస్ జె సూర్య సరసన రెజీనా హీరోయిన్గా నటిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement