సమస్యలు సృష్టిస్తున్నారు | Sivakartikeyan new movie remo | Sakshi
Sakshi News home page

సమస్యలు సృష్టిస్తున్నారు

Oct 13 2016 2:11 AM | Updated on Sep 4 2017 5:00 PM

సమస్యలు సృష్టిస్తున్నారు

సమస్యలు సృష్టిస్తున్నారు

సమస్యలు సృష్టిస్తున్నారంటూ నటుడు శివకార్తికేయన్ కంటతడి పెట్టారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నటుడు శివకార్తికేయన్.

సమస్యలు సృష్టిస్తున్నారంటూ నటుడు శివకార్తికేయన్ కంటతడి పెట్టారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నటుడు శివకార్తికేయన్. ఈయన నటించిన తాజా చిత్రం రెమో. కీర్తీసురేష్ నాయకిగా నటించిన ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ పరిచయం అయ్యారు. శుక్రవారం తెరపైకి వచ్చిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణను పొందుతున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక నుంగంబాక్కంలోని ఒక నక్షత్ర హోటల్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ తాను నటించిన రజనీమురుగన్ చిత్రం విడుదల సయమంలో ఎన్ని సమస్యలను ఎదుర్కొందో అందరికీ తెలిసిందేనన్నారు.

ఒక చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత అది విడుదలవుతుందో, లేదో తెలియని పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. నిజానికి అంత బాధ పడాల్సిన అవసరం లేదన్నారు. ఇక రెమో చిత్రానికి అలాంటి సమస్యలనే ఎదుర్కోవలసివచ్చిందన్నారు. తాను గానీ, ఇతర చిత్ర యూనిట్‌గానీ చిత్రం చూసిన తరువాత మరో విధంగా చేస్తే బాగుండని అనుకుని ఉండవచ్చని,అయితే ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ రెమోపై నమ్మకం కలిగిన వ్యక్తి నిర్మాత రాజానేనని అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. డబ్బు సంపాదించుకుని ఎక్కడైనా సెటిల్ అయిపోవచ్చునని, అయితే తాము అలా అనుకోవడం లేదనిఅన్నారు. మంచి చిత్రం చేసి ప్రేక్షకులను అలరింపజేయాలన్నదే తమ భావన అని తెలిపారు.

తాము ఎవరి సాయం కోరుకోవడం లేదన్నారు. కొత్త కొత్త ఆలోచనలతో మంచి కథా చిత్రాలను ప్రేక్షకులకు అందించాలని ఆశిస్తున్నామనిఅందువల్ల దయచేసి తమను పని చేసుకోనివ్వండి అంటూ కంటతడి పెట్టారు. ఇంకా ఆయన మాట్లాడుతూ తప్పు చే స్తే బాధ పడవచ్చునని, తాము ఎలాంటి తప్పు చేయడం లేదని,కష్టపడి పని చేసుకుంటున్నామని అన్నారు. అందుకే ఆ బాధ అనిపిస్తోందని పేర్కొన్నారు. నటి కీర్తీసురేశ్,అనిరుద్, కేఎస్.రవికుమార్, చాయాగ్రాహకుడు పీసీ.శ్రీరామ్ డిస్ట్రిబ్యూటర్ తిరుపూర్ సుబ్రమణియన్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement