అన్నీ తెలుగు పాటలే

singers chitra srikrishna srinidhi saket and sony going to sing for girls welfare fund rising - Sakshi

బాలికల సంక్షేమం కోసం నిధులు సేకరించేందుకు ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ గాయని చిత్ర పాడబోతున్నారు. ఎలెవెన్‌ పాయింట్‌ టు సంస్థ నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని వికేర్‌ సంస్థ సమర్పిస్తోంది. ఈ కార్యక్రమం ఈ రోజు హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో జరగనుంది. ఈ సంగీత విభావరిలో శ్రీకృష్ణ, శ్రీనిధి, సోనీ వంటి పలువురు సింగర్స్‌ పాల్గొంటారు. ఈ సందర్భంగా చిత్ర మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే కొన్ని పాటలు ప్రాక్టీస్‌ చేశాం.

కొన్నిపాటలను శ్రీకృష్ణ, శ్రీనిధి, సాకేత్, సోనీ కూడా పాడతారు. మూడు గంటలపాటు జరిగే ఈ కార్యక్రమంలో అందరికీ పరిచయం ఉన్న మ్యూజిషియన్సే పాల్గొంటారు. అన్నీ తెలుగు పాటలే ఉంటాయి. మంచి కారణం కోసం చేస్తున్న ప్రోగ్రామ్‌ ఇది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘భారతీయ భాషలు చేసుకున్న పుణ్యమిది. మా చిత్రమ్మగారు మంచి కార్యక్రమం చేయబోతున్నారు’’ అన్నారు శ్రీకృష్ణ. ‘‘చిత్రగారు అసోసియేట్‌ అయిన కార్యక్రమంలో భాగం కావడం అదృష్టం’’ అన్నారు శ్రీనిధి. సాకేత్, సోనీ మాట్లాడారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top