ప్రముఖ గాయని శ్యామల జి భావే మృతి

Singer Shyamala G Bhave Last Breath For Heart Stroke at 79 - Sakshi

బెంగళూరు : ‘ఉభయ గాన విదుషి’గా పేరుగాంచిన ప్రఖ్యాత హిందూస్థానీ, కర్ణాటక సంగీత గాయకురాలు శ్యామల జి భావే(79) శుక్రవారం మృతి చెందారు. కొద్దిరోజులుగా అరోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్యామల ఇవాళ ఉదయం 7.30 గంటలకు ఆమె నివాసంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా కొంతకాలంగా శ్యామల హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొంది మూడు రోజుల క్రితమే డిశ్చార్జ్‌ అయినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో 2 రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షిణించడంతో ఈ రోజు ఉదయం గుండేపోటుతో కన్నుమూసినట్లు వారు వెల్లడించారు.

అయితే ఆమెరికాలో నివసిస్తున్న ఆమె సోదరి నిర్మలా వచ్చాకే అంత్యక్రియలు చేయాలనే యోజనలో కుటుంబ సభ‍్యులు ఉన్నట్లు సమాచారం. ఆమె తండ్రి, ప్రఖ్యాత దివంగత గోవింద్‌ విఠల్‌ భావే శ్యామలకు హిందూస్థానీ సంగీతంలో శిక్షణ ఇవ్వగా... ప్రముఖ కర్ణాటక గాయకులు ఎ సుబ్బారాయ, బి దోరేస్వామి ఆమెకు కర్ణాటక సంగీతంలో శి​క్షణ ఇచ్చారు. తల్లి లక్ష్మీ భావే కూడా శాస్త్రీయ గాయకురాలే. ఇక శ్యామల 12 ఏళ్ల వయసు నుంచే సంగీత ప్రదర్శలు ఇవ్వడం ప్రారంభించారు. కాగా మైసూర్‌ 19వ దివాన్‌ సర్‌ ఎం విశ్వేశ్వరాయ ఆమెకు ‘ఉభయ గాన విదుషి’  బిరుదును ప్రదానం చేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top