
ఆ రీమేక్‌లో నటిస్తే నేనే చెప్తా!
‘‘నాకు నిధి దొరికింది’’ అంటున్నారు శ్రుతీహాసన్. అయితే అది బంగారమో, వజ్రాల నిధో కాదు. మరి దేని గురించి శ్రుతి అలా అన్నారనే కదా మీ సందేహం. ఆమె చెబుతున్నది తన చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి
‘‘నాకు నిధి దొరికింది’’ అంటున్నారు శ్రుతీహాసన్. అయితే అది బంగారమో, వజ్రాల నిధో కాదు. మరి దేని గురించి శ్రుతి అలా అన్నారనే కదా మీ సందేహం. ఆమె చెబుతున్నది తన చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి ‘‘నా అదృష్టమో ఏమో కానీ.. నా చుట్టూ ఉన్నవాళ్లందరూ మంచి వ్యక్తులే. ఇంతకు మించిన నిధి ఏమైనా ఉంటుందా?’’ అన్నారు శ్రుతి. ప్రస్తుతం ఆమె కోయంబత్తూర్‌లో ఉన్నారు. విశాల్ సరసన శ్రుతి నటిస్తున్న తమిళ చిత్రం ‘పూజై’ షూటింగ్ అక్కడ ఓ షాపింగ్ మాల్‌లో జరుగుతోంది. టాకీతో పాటు ఫైట్స్ కూడా తీస్తున్నారట. ఈ షూటింగ్ బాగా జరుగుతోందని శ్రుతి అన్నారు. ఇదిలా ఉంటే, హిందీలో ఘనవిజయం సాధించిన ‘2 స్టేట్స్’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ కానుందని, వాటిలో శ్రుతి కథానాయికగా నటించనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. అయితే, ఈ రీమేక్‌లో తను నటించడంలేదని, ఒకవేళ నటిస్తే స్వయంగా ప్రకటిస్తానని శ్రుతి పేర్కొన్నారు.