Remake Rumors
-
నిన్న ప్రభాస్.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్!
ముంబై: గత కొన్నేళ్లుగా సౌత్ మూవీలకు బాలీవుడ్లో గిరాకీ బాగా పెరిగింది. దక్షిణాది సినిమాలను బీ-టౌన్లో రీమేక్ చేస్తూ నిర్మాతలు లాభాలు గడిస్తున్నారు. ముఖ్యంగా కండలవీరుడు సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్ వంటి స్టార్లు తెలుగు కథలను బాలీవుడ్‌కు తీసుకువెళ్లి హిట్లు కొట్టి సత్తా చాటుతున్నారు. రెడీ, పోకిరి, కిక్ వంటి సినిమాలతో సల్మాన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయగా.. అర్జున్ రెడ్డితో కబీర్ సింగ్‌గా చెరగని ముద్ర వేసిన షాహిద్.. నాని ‘జెర్సీ’ రీమేక్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా ఖ్యాతిగడించిన ప్రభాస్ బ్లాక్‌బస్టర్ ఛత్రపతిని హిందీలో రీమేక్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి మూవీకి సంబంధించిన ఆసక్తికర వార్త ఫిల్మీ దునియాలో షికారు చేస్తోంది. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు నిర్మాత ఎస్ తౌరానీ నిర్ణయించుకున్నారట. (చదవండి: ఛత్రపతి రీమేక్‌లో సాయి శ్రీనివాస్) ఇందుకు సంబంధించి స్క్రిప్టు కూడా సిద్ధం చేయిస్తున్నట్లు సమాచారం. హిందీ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మాతృకలో పలు మార్పులు చేసి 2021 ఆరంభంలో సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్- తమన్నా జంటగా రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తప్పకుండా ఆడియెన్స్‌ను అలరిస్తుందనే నమ్మకంతోనే ఊసరవెళ్లి విడుదలై పదేళ్లు దగ్గరపడుతున్నా రీమేక్ చేసేందుకు తౌరానీ సిద్ధపడినట్లు బీ-టౌన్లో టాక్ వినిపిస్తోంది. ఇక తారక్ ప్రస్తుతం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ రీమేక్‌లో నటిస్తే నేనే చెప్తా!
‘‘నాకు నిధి దొరికింది’’ అంటున్నారు శ్రుతీహాసన్. అయితే అది బంగారమో, వజ్రాల నిధో కాదు. మరి దేని గురించి శ్రుతి అలా అన్నారనే కదా మీ సందేహం. ఆమె చెబుతున్నది తన చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి ‘‘నా అదృష్టమో ఏమో కానీ.. నా చుట్టూ ఉన్నవాళ్లందరూ మంచి వ్యక్తులే. ఇంతకు మించిన నిధి ఏమైనా ఉంటుందా?’’ అన్నారు శ్రుతి. ప్రస్తుతం ఆమె కోయంబత్తూర్‌లో ఉన్నారు. విశాల్ సరసన శ్రుతి నటిస్తున్న తమిళ చిత్రం ‘పూజై’ షూటింగ్ అక్కడ ఓ షాపింగ్ మాల్లో జరుగుతోంది. టాకీతో పాటు ఫైట్స్ కూడా తీస్తున్నారట. ఈ షూటింగ్ బాగా జరుగుతోందని శ్రుతి అన్నారు. ఇదిలా ఉంటే, హిందీలో ఘనవిజయం సాధించిన ‘2 స్టేట్స్’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ కానుందని, వాటిలో శ్రుతి కథానాయికగా నటించనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. అయితే, ఈ రీమేక్‌లో తను నటించడంలేదని, ఒకవేళ నటిస్తే స్వయంగా ప్రకటిస్తానని శ్రుతి పేర్కొన్నారు.