అందుకే తప్పుకున్నా! | Shruti Haasan opts out of 'Sangamithra' | Sakshi
Sakshi News home page

అందుకే తప్పుకున్నా!

May 30 2017 12:19 AM | Updated on Sep 5 2017 12:17 PM

అందుకే తప్పుకున్నా!

అందుకే తప్పుకున్నా!

ఈ సినిమా కోసం ఫిజికల్‌గానే కాదు.. మెంటల్‌గా కూడా చాలా ప్రిపేర్‌ అవుతున్నా.

‘‘ఈ సినిమా కోసం ఫిజికల్‌గానే కాదు.. మెంటల్‌గా కూడా చాలా ప్రిపేర్‌ అవుతున్నా. కొన్ని యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నా’’ అని శ్రుతీహాసన్‌ చెప్పి నెల రోజులు కూడా కాలేదు. ఈలోపు ఆమె ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ సినిమా ఏదో ఊహించే ఉంటారు. ‘సంఘమిత్ర’. శ్రుతీహాసన్‌ లీడ్‌రోల్‌లో దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో సుందర్‌.సి రూపొందించనున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను ఫ్రాన్స్‌లో జరిగిన  కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రిలీజ్‌ చేశారు.

శ్రుతి కూడా అక్కడకు వెళ్లారు. అలాంటిది ఈ సినిమా నుంచి ఆమె ఎందుకు తప్పుకున్నారు? ‘‘పూర్తి బౌండ్‌ స్క్రిప్ట్‌ అందజేయకపోవడం, షూటింగ్‌ షెడ్యూల్స్‌ గురించి సరిగ్గా క్లారిటీ ఇవ్వకపోవడంవల్లే శ్రుతి ఈ సినిమా నుంచి తప్పుకున్నారు’’ అని  ఆమె వ్యక్తిగత సిబ్బంది సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ‘‘కొన్ని అనివార్య కారణాల వల్ల శ్రుతీహాసన్‌తో ‘సంఘమిత్ర’ చేయలేకపోతున్నాం’’ అంటూ చిత్రనిర్మాణ సంస్థ శ్రీ తేనాండాల్‌ ఫిల్మ్స్‌  ప్రకటించింది. నిజానికి ఈ సినిమా కోసం శ్రుతి  లండన్‌లో యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. అదంతా వేస్ట్‌ అయిందను కోడానికి లేదు. ఎందుకంటే భవిష్యత్తులో ఆమె ఇలాంటి సినిమా చేస్తే ఉపయోగపడుతుంది కదా.

Advertisement
 
Advertisement
Advertisement