
శిల్పాశెట్టి ఇంట్లో దొంగలుపడ్డారు
బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి ఇంట్లో దొంగలు పడ్డారు.
బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి ఇంట్లో దొంగలు పడ్డారు. భర్త రాజ్కుంద్రాతో కలసి ముంబైలో నివసిస్తున్న శిల్ప ఇంట్లో ఇటీవల దొంగతనం జరిగినట్టు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఖరీదైన మ్యూజిక్ సిస్టమ్, ఓ ఐపాడ్ను దొంగలు ఎత్తుకెళ్లారు. నగదు, ఆభరణాలు పోయినట్టు సమాచారం లేదు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
'ఈ నెల 16న శిల్పాశెట్టి ఇంటి మేనేజర్ ఫిర్యాదు చేశారు. ఇప్పటిదాకా ఎవర్నీ అరెస్ట్ చేయలేదు' అని జుహూ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చెప్పారు. కాగా ఆ సమయంలో శిల్పా దంపతులు ఇంట్లో ఉన్నారా లేదా అన్న విషయం తెలియరాలేదు. ప్రస్తుతం వీరిద్దరూ కొత్త ప్రాజెక్టులతో తీరికలేకుండా ఉన్నారు. సొంత బ్యానర్పై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక రాజ్కుంద్రా ఓ పుస్తకాన్ని రాశారు. దీన్ని ఈ రోజు రాత్రి ఆవిష్కరించనున్నారు.