యాంకర్‌.. హోస్ట్‌గా అదరగొట్టే శిల్పా చక్రవర్తి | Shilpa Chakravarthy Wild Card Entry In Bigg Boss 3 Telugu | Sakshi
Sakshi News home page

యాంకర్‌.. హోస్ట్‌గా అదరగొట్టే శిల్పా చక్రవర్తి

Sep 2 2019 10:34 PM | Updated on Sep 16 2019 3:55 PM

Shilpa Chakravarthy Wild Card Entry In Bigg Boss 3 Telugu - Sakshi

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అన్నది బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎప్పుడూ ప్రత్యేకమే.. మొదటి సీజన్‌లో నవదీప్‌, రెండో సీజన్‌లో పూజా రామచంద్రన్‌ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను  ఎంటర్‌టైన్‌ చేశారు. ఇక మూడో సీజన్‌కు వచ్చేసరికి ఓ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వడమూ, వెళ్లిపోవడమూ జరిగిపోయింది. ట్రాన్స్‌ జెండర్‌ తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చి.. సంచలన కామెంట్లు చేసి, హౌస్‌మేట్స్‌తో ఎప్పుడూ గొడవలు పెట్టుకుంటూ ఇంటి నుంచి వెళ్లిపోయింది.

ఇక రెండో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ద్వారా శిల్పా చక్రవర్తి ఎంటర్‌ అయింది. మోడలింగ్‌ నుంచి టీవీ సీరియల్స్‌లో నటిస్తూ.. యాంకరింగ్‌ చేస్తూ ఫేమస్‌ అయింది. పలు సినీ కార్యక్రమాలకు హోస్ట్‌గా పాపులార్టీ సంపాదించింది. బెంగాలీ మాతృభాష అయినా.. తెలుగులో అనర్గళంగా మాట్లాడటం ఆమె ప్రత్యేకత. మరి బిగ్‌బాస్‌ హౌస్‌లో చివరకు వరకు నిలబడుతుందా? లేదా అన్నది చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement