ఆ మూడు లుక్స్‌ అంటే ఇష్టం! | She likes the look of the three films | Sakshi
Sakshi News home page

ఆ మూడు లుక్స్‌ అంటే ఇష్టం!

Aug 28 2017 1:34 AM | Updated on Sep 17 2017 6:01 PM

ఆ మూడు లుక్స్‌ అంటే ఇష్టం!

ఆ మూడు లుక్స్‌ అంటే ఇష్టం!

సుమారు 15 ఏళ్ళ కెరీర్‌లో ప్రియాంక ఎన్నో రకాల పాత్రలను పోషించారు.

సుమారు 15 ఏళ్ళ కెరీర్‌లో ప్రియాంక ఎన్నో రకాల పాత్రలను పోషించారు. బాలీవుడ్‌ స్థాయి నుంచి హాలీవుడ్‌ స్థాయికి ఎదిగారు. హీరోయిన్‌గా గ్లామరస్‌ రోల్స్‌తో పాటు నాన్‌–గ్లామరస్‌ రోల్స్‌ కూడా చేశారు. ఇప్పటివరకూ చేసిన పాత్రల్లో తనకు మాత్రం మూడు సినిమాల్లోని లుక్స్‌ అంటేనే ఇష్టం అని చెబుతున్నారు ప్రియాంక.

ఫర్హాన్‌ అక్తర్‌ డైరెక్షన్‌లో షారుక్‌ హీరోగా వచ్చిన ‘డాన్‌’ చిత్రంలోని ‘రోమా’ క్యారెక్టర్‌ లుక్, జోయా అక్తర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘దిల్‌ ధఢ్‌కనే దో’ సినిమాలో అయేషా క్యారెక్టర్‌ లుక్, అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘గుండే’ సినిమాలోని నందిత క్యారెక్టర్‌ లుక్‌. ‘‘ఈ మూడు లుక్స్‌ అంటే నాకు చాలా ఇష్టం’’ అని పేర్కొన్నారు ప్రియాంక. మేకప్‌ గురించి మాట్లాడుతూ – ‘‘క్యారెక్టర్‌ కోసం సెట్‌లో ఉన్నప్పుడు హెవీ మేకప్‌ వేసుకుంటా. విడిగా మాత్రం సింపుల్‌ మేకప్‌నే ఇష్టపడతా. కంఫర్ట్‌గా ఉండే డ్రెస్సులే వేసుకుంటా. అలా లేనప్పుడు ఏ బ్రాండ్‌ అయినా పట్టించుకోను’’ అని ప్రియాంక స్పష్టం చేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement