కోచ్చడయాన్ కోసం చెన్నైకి షారూఖ్ | sharukh khan came to chennai for kochadaiyaan | Sakshi
Sakshi News home page

కోచ్చడయాన్ కోసం చెన్నైకి షారూఖ్

Mar 8 2014 12:56 AM | Updated on Sep 2 2017 4:27 AM

కోచ్చడయాన్ కోసం చెన్నైకి షారూఖ్

కోచ్చడయాన్ కోసం చెన్నైకి షారూఖ్

కోచ్చడయాన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొనడానికి బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఆది వారం చెన్నైకి ప్రత్యేకంగా రానున్నారన్నది తాజా సమాచారం.

 కోచ్చడయాన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొనడానికి బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఆది వారం చెన్నైకి ప్రత్యేకంగా రానున్నారన్నది తాజా సమాచారం. సూపర్‌స్టార్ రజనీ కాంత్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కోచ్చడయాన్. ఇప్ప టి వరకు భారతీ య చలన చిత్ర పరిశ్రమలో తెరకెక్కనటువంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భారీ బడ్జెట్‌లో సిల్వర్ స్క్రీన్ పై వండర్స్ సృష్టించడానికి సిద్ధం అవుతోంది.
 
  స్వదేశంతోపాటు విదేశాలలోను అత్యధిక థియేటర్లలో విడుదల కానున్న తొలి చిత్రంగా కోచ్చడయాన్ రికార్డుకెక్కనుంది. ఈ చిత్రం ఆడి యో ఆవిష్కరణ ఆదివారం చెన్నైలో భారీ ఎత్తున జరగనుంది. ఈ కార్యక్రమానికి బిగ్ బి అమితాబ్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ఖాన్ కూడా పాల్గొననున్నట్లు ఆ చిత్ర దర్శకురాలు సౌందర్య అశ్విన్ వెల్లడించారు. షారూఖ్‌ఖాన్ రజనీ కాంత్‌కు విరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఆయన రా ఒన్ చిత్రం లో రజనీ కాంత్ సరసన ఒక సన్నివేశంలో తళుక్కున మెరిసిన విషయం విదితమే. సౌంద ర్య అశ్విన్ ఫోన్ చేసి కోచ్చడయాన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి రావలసిందిగా కోరగానే వెంటనే ఓకే చెప్పారట. ఈ విషయా న్ని సౌందర్య అశ్విన్ చెప్పినట్లు ఒక ఆంగ్ల పత్రిక పేర్కొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement