కేడీ యాక్షన్‌

Shakalaka Shankar's Kedi No 1 Movie First Look reklease - Sakshi

‘శంభో శంకర’ సినిమాతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్‌ చేశారు హాస్యనటుడు ‘షకలక’ శంకర్‌. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కేడీ నెం1’. జానీ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ‘తుపాకి, ఉరిమి, పులి’ వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన డి. గిరీష్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేసిన నిర్మాత కేవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘గిరీష్‌బాబు నిర్మిస్తున్న తొలి చిత్రమిది.

నేను నిర్మించిన సినిమాలకు వర్క్‌ చేసిన జానీ దర్శకత్వం చేస్తున్నాడు. ఫస్ట్‌ లుక్‌ బాగుంది. సినిమా సక్సెస్‌ కావాలి’’ అన్నారు. ‘‘యాక్షన్‌ చిత్రమిది. ఇంకా 15 రోజుల షూటింగ్‌ మాత్రమే బ్యాలెన్స్‌. అక్టోబర్‌లో రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత. ‘‘ఈ సినిమాలో జానీ నన్ను కొత్తగా చూపిస్తున్నారు. తన దగ్గర్నుంచి చాలా నేర్చుకుంటున్నాను’’అన్నారు  శంకర్‌. ‘‘కామెడీ మాత్రమే కాదు యాక్షన్‌ కూడా చేయగలడని శంకర్‌ ఈ సినిమా ద్వారా నిరూపిస్తారు’’ అన్నారు జానీ.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top