మరో బ్లాక్ బస్టర్‌గా సైతాన్! | Shaitan movie audio released | Sakshi
Sakshi News home page

మరో బ్లాక్ బస్టర్‌గా సైతాన్!

Nov 4 2016 2:56 AM | Updated on Jul 12 2019 4:40 PM

మరో బ్లాక్ బస్టర్‌గా  సైతాన్! - Sakshi

మరో బ్లాక్ బస్టర్‌గా సైతాన్!

విజయం సాధిస్తానన్న విజయ్‌ఆంటోనిలోని కాన్ఫిడెన్‌‌స తనకు బాగా నచ్చిందని సీనియర్ దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్ అన్నారు.

విజయం సాధిస్తానన్న విజయ్‌ఆంటోనిలోని కాన్ఫిడెన్‌‌స తనకు బాగా నచ్చిందని సీనియర్ దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్ అన్నారు. సంగీతదర్శకుడు, కథానాయకుడు అంటూ రెండు పడవల్లో పయనిస్తూ వరుస విజయాలను సాధిస్తున్న విజయ్‌ఆంటోని పిచ్చైక్కారన్ చిత్రం తరువాత తాజాగా నటించిన చిత్రం సైతాన్. ఆయనే సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో అరుంధతీనాయర్ నాయకిగా నటించారు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్‌ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్‌ఆంటోని నిర్మిస్తున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక సత్యం సినీ థియేటర్‌లో జరిగింది. చిత్ర ఆడియోను ఎస్‌ఏ.చంద్రశేఖర్ ఆవిష్కరించగా తొలి సీడీని ఐసరి గణేశ్ అందుకున్నారు.

ఈసందర్భంగా ఎస్‌ఏ.చంద్రశేఖర్ మాట్లాడుతూ విజయ్‌ఆంటోని సంగీత దర్శకుడిగా రాణిస్తున్న సమయంలోనే హీరోగా నటించడానికి రెడీ అవ్వడాన్ని తెలుసుకుని తాను ఆయన్ని పిలిచి ఇప్పుడు బాగానే ఉందిగా హీరోగా అవసరమా? అని అడిగానన్నారు. అందుకు తను చెప్పిన సమాధానం తాను హీరోగానూ జరుుస్తాను అని కాన్ఫిడెన్‌‌సతో అనడం అని పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన విజయాన్ని తన కొడుకు విజయ్ విజయం అంతగా సంతోషిస్తున్నానని అన్నారు. విజయ్‌ఆంటోని మరిన్ని విజయాలు సాధించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

అనంతరం విజయ్‌ఆంటోని మాట్లాడుతూ సైతాన్ చిత్రం బాగా వచ్చిందని, మరో బ్లాక్ బ్లస్టర్ చిత్రం అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు ఈ చిత్రం కోసం రేయింబవళ్లు శ్రమించారని, చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శశి, నటుడు శిబిరాజ్, చాంబర్ గౌరవ కార్యదర్శి కాట్రగడ్డ ప్రసాద్, నటి అరుంధతి నాయర్ పాల్గొన్నారు. సైతాన్ చిత్ర తమిళనాడు విడుదల హక్కులను ఆరా సినిమా సంస్థ, తెలుగు హక్కులను శివకుమాలు పొందారున్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement