
ఆ హీరో ఇల్లు ఖరీదు ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే
ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యంత సంతోషంగా ఉన్న హీరో ఎవరనగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు షాహిద్ కపూర్. అవును మరి.. మరికొన్ని రోజుల్లో షాహిద్ కపూర్ రెండో బిడ్డకు తండ్రి కాబోతున్నారు. అంతేనా ఈ హీరో నటించిన ‘పద్మావత్’ 300 కోట్ల రూపాయల బాక్సాఫీస్ క్లబ్‌లో చేరింది. ‘పద్మావత్’ సినిమా ఈ హీరో కెరీర్‌లోనే అతిపెద్ద హిట్ట్. ఇన్ని సంతోషాల నడుమ ఇప్పుడు మరో సంతోషం. అది ఏంటంటే త్వరలో ఈ హీరో ఓ ఇంటి వాడవుతున్నారు.
అదేంటి షాహీద్ కపూర్‌కు ఎప్పుడో వివాహం అయ్యింది. ఓ బిడ్డకు తండ్రి, త్వరలోనే మరో బిడ్డకు కూడా తండ్రి కాబోతున్నారు. అలాంటిది ఇప్పుడు ఓ ఇంటి వాడు అవ్వడం ఏంటి అనుకుంటున్నారా..? అంటే మరేం లేదు, ఓ కొత్త ఇల్లు కొంటున్నారని అర్ధం. ప్రస్తుతం షాహిద్ జుహు తారా రోడ్డులోని ‘ప్రణీత భవనం’లో ఉంటున్నారు. కానీ ఆ ప్రాంతంలో ఈ మధ్య వ్యభిచార కార్యకలాపాలు ఎక్కువైపోతున్నాయన్న కారణంతో వీరు ఇల్లు మారబోతున్నట్లు సమాచారం.
‘ఖిలాడి’ హీరో అక్షయ్ కుమార్, ఐశ్వర్య - అభిషేక్ బచ్చన్‌లు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే ఇప్పుడు షాహిద్ కూడా ఓ డ్యూప్లెక్స్ ఫ్లాట్‌ను కొన్నారని సమాచారం. ముంబయిలోని వర్లీలో ఉన్న ఈ ఫ్లాట్ ఖరీదు రూ.55.60 కోట్లని బాలీవుడ్ వర్గాల అంచనా. రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికే షాహిద్ 2.19 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం షాహిద్ కొన్న ఈ కొత్త ఫ్లాట్, అపార్ట్‌మెంట్‌లోని 42వ అంతస్తులో ఉన్నట్లు తెలిసింది. 8,625 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్‌లో ఒకేసారు ఆరు కార్లను పార్కింగ్ చేసుకునే సౌకర్యం కూడా ఉందని చెబుతున్నారు. ఈ ఫ్లాట్‌ను షాహిద్ పంకజ్ కపూర్, మీరా పేర్లతో రిజిస్టర్ చేయించారట. అయితే ఇదే అపార్ట్‌మెంట్‌లో అభిషేక్ - ఐశ్వర్య 2013లో, అక్షయ్ 2015లో ఫ్లాట్ కొన్నారు. ఇప్పుడు వీరి సరసన షాహీద్ కపూర్ కూడా చేరి ఇరుగుపొరుగు అయ్యారు. ఇప్పటికే కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోలను షాహిద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ప్రస్తుతం షాహిద్ కపూర్ శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘బట్టీగుల్ మీటర్ చాలులో నటిస్తున్నారు. ఇందులో షాహిద్‌కు జోడిగా శ్రద్ధా కపూర్, యామీ గౌతమ్ నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.