'షారుక్ నాకు బుద్ధి చెప్పాడు' | Shah Rukh taught me to be humble: Waluscha De Sousa | Sakshi
Sakshi News home page

'షారుక్ నాకు బుద్ధి చెప్పాడు'

Apr 3 2016 11:44 AM | Updated on Apr 3 2019 6:23 PM

'షారుక్ నాకు బుద్ధి చెప్పాడు' - Sakshi

'షారుక్ నాకు బుద్ధి చెప్పాడు'

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనను బుద్ధిగా ఉండాలని చెప్పాడని ఫ్యాన్ చిత్రంలో హీరోయిన్ గా జతకట్టిన వాలుస్కా డిసౌజా చెప్పింది.

ముంబయి: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనను బుద్ధిగా ఉండాలని చెప్పాడని ఫ్యాన్ చిత్రంలో హీరోయిన్ గా జతకట్టిన వాలుస్కా డిసౌజా చెప్పింది. అణుకువ అనేది నటికి అవసరం అని చెప్పారని తెలిపింది. షారుక్ తో కలిసి నటించిన తర్వాత ఆయనంటే ఎంతో గౌరవం పెరిగిందని చెప్పింది.

'నేను ఆయనతో కలిసి ఫ్యాన్ చిత్రంలో నటించిన తర్వాత నిజంగానే పెద్ద ఫ్యాన్ అయిపోయాను. విజయం అనేది నుదుటిపై రాసిపెట్టి ఉండదని మన చేతుల్లోనే ఉంటుందని నమ్మే వ్యక్తిత్వం షారుక్ ది. అదే విషయం నాకు చెప్పారు. ఆయన ద్వారా ఎంతో నేర్చుకున్నాను. ఏ పనిచేసినా దానికి వందశాతం శ్రమించాలని షారుక్ సెట్లో చెప్పేవారు. షారుక్ వాస్తవానికి చాలా మౌనంగా ఉంటారు. ఆయనతో పనిచేయడం ప్రారంభించాక ఏమైనా ఇస్తారు. ఆయనెప్పుడూ కోపంతో, ఒత్తిడితో కనిపించరు. ఆయన షూటింగ్ సమయంలో ఒక సూపర్ స్టార్ మాదిరిగా కాకుండా ఒక నటుడిగా ఆయన పనిచేసుకుపోతారు' అంటూ చెప్పింది డిసౌజా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement