షారూఖ్.. చాలా కాలం తరువాత..! | Shah Rukh Khan rides train to promote Raees | Sakshi
Sakshi News home page

షారూఖ్.. చాలా కాలం తరువాత..!

Jan 24 2017 10:53 AM | Updated on Sep 5 2017 2:01 AM

షారూఖ్.. చాలా కాలం తరువాత..!

షారూఖ్.. చాలా కాలం తరువాత..!

కొద్ది రోజులుగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్, రాయిస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

కొద్ది రోజులుగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్, రాయిస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ఈ సినిమా విడుదలవుతోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరో షారూఖ్ ఖాన్ పాల్గొంటున్నాడు.

సాధారణంగా బాలీవుడ్ హీరోలు ప్రచారం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ప్రత్యేక విమానాలను వాడుతుంటారు. కానీ రాయిస్ ప్రచారం కోసం షారూఖ్, ట్రైన్లో ప్రయాణిస్తున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలలో ప్రచారం నిర్వహించాలంటే ట్రైన్ జర్నీనే కరెక్ట్ అంటున్నాడు షారూఖ్. ఈ సందర్భంగా మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నాడు.

షారూఖ్, స్మగ్లర్గా నటిస్తున్న ఈ సినిమా విశేషాలను తెలియజేస్తూ ఇదో రియలిస్టిక్ సినిమా అందుకే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కొత్త అమ్మాయి అయితే కరెక్ట్ అని భావించాం.. ఎంతో మందిని ఆడిషన్ చేసిన తరువాత మహిరను సెలెక్ట్ చేశామన్నారు. అంతేకాదు ట్రైన్ ప్రయాణంపై స్పందించిన షారూఖ్, చాలా కాలం తరువాత ఇండియన్ రైల్వేస్లో ప్రయాణించటం ఆనందంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement