breaking news
Mahira
-
జనాయ్ భోంస్లే కాదు.. సిరాజ్ డేటింగ్లో ఉన్నది ఆమెతోనే?
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. బిగ్ బాస్ 13 ఫేమ్ మహిరా శర్మతో సిరాజ్ డేటింగ్ చేస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని సిరాజ్, మహిరా సన్నిహితులు ధ్రువీకరించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ రిపోర్ట్‌లో పేర్కొంది. అయితే వీరిద్దరూ ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడా కలిసి కన్పించలేదు.అయినప్పటికి సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో చేయడం, ఫోటోలకు లైక్‌లు చేయడం వంటి చర్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని రూమర్స్ మొదలయ్యాయి. కాగా సిరాజ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరలవ్వడం ఇదేమి తొలిసారి కాదు.ఇటీవలే లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జానాయ్ భోస్లేతో ఈ స్టార్ పేసర్ ప్రేమలో ఉన్నాడని వార్తలు విన్పించాయి. కానీ వాటిని వారిద్దరూ కొట్టిపారేశారు. తమది అన్నాచెల్లెళ్ల బంధమంటూ చెప్పుకొచ్చారు. మళ్లీ ఇప్పుడు మరోసారి సిరాజ్ డేటింగ్ వార్తలు తెరపైకి వచ్చాయి.ఎవరీ మహిరా శర్మ?మహిరా శర్మ.. వర్ధమాన భారతీయ నటీమణులలో ఒకరు. నాగిన్-2, బేపనా ప్యార్, కుండలీ భాగ్యలాంటి సీరియల్స్ తో పాపులర్ అయింది. పలు పంజాబీ మ్యూజిక్ వీడియోలలో కూడా ఆమె కన్పించింది. అయినప్పటికి బిగ్ బాస్ 13లో పాల్గొన్న తర్వాత ఆమె మరింత ఫేమస్ అయ్యింది. అక్కడ తోటి కంటెస్టెంట్ పరాస్ ఛబ్రాతో ఆమె ప్రేమయాణం నడిపింది. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు.స్పందించిన మహిరా తల్లి..అయితే ఈ వార్తలపై మహిరా తల్లి సానియా శర్మ తాజాగా స్పందించింది. అసలేమి మాట్లాడుతున్నారు. వారిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు. ప్రజలు ఎదైనా మాట్లాడుతారు. ఇప్పుడు నా కుమార్తె సెలబ్రిటీ కాబట్టి ఎటువంటి వార్తలు రావడం సహజం. వీటిని మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఈ వార్త పూర్తిగా అబద్ధమని టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సానియా శర్మ పేర్కొంది.రంజీల్లో ఆడనున్న సిరాజ్..కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాని సిరాజ్ రంజీ బాట పట్టాడు. గురువారం నుంచి నాగ్‌పూర్‌లో విదర్భ జట్టుతో జరిగే ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో హైదరాబాద్ తరపున బరిలోకి దిగుతున్నాడు. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2020లో చివరి రంజీ మ్యాచ్ కూడా విదర్భతోనే ఆడిన సిరాజ్... మళ్లీ ఆ ప్రత్యర్థితోనే దేశవాళీ ఆట ఆడబోతున్నాడు.చదవండి: అందరి చూపు కోహ్లి వైపు -
షారూఖ్.. చాలా కాలం తరువాత..!
కొద్ది రోజులుగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్, రాయిస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ఈ సినిమా విడుదలవుతోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరో షారూఖ్ ఖాన్ పాల్గొంటున్నాడు. సాధారణంగా బాలీవుడ్ హీరోలు ప్రచారం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ప్రత్యేక విమానాలను వాడుతుంటారు. కానీ రాయిస్ ప్రచారం కోసం షారూఖ్, ట్రైన్లో ప్రయాణిస్తున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలలో ప్రచారం నిర్వహించాలంటే ట్రైన్ జర్నీనే కరెక్ట్ అంటున్నాడు షారూఖ్. ఈ సందర్భంగా మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నాడు. షారూఖ్, స్మగ్లర్‌గా నటిస్తున్న ఈ సినిమా విశేషాలను తెలియజేస్తూ ఇదో రియలిస్టిక్ సినిమా అందుకే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కొత్త అమ్మాయి అయితే కరెక్ట్ అని భావించాం.. ఎంతో మందిని ఆడిషన్ చేసిన తరువాత మహిరను సెలెక్ట్ చేశామన్నారు. అంతేకాదు ట్రైన్ ప్రయాణంపై స్పందించిన షారూఖ్, చాలా కాలం తరువాత ఇండియన్ రైల్వేస్‌లో ప్రయాణించటం ఆనందంగా ఉందన్నారు.