‘టెంపర్‌’ రీమేక్‌కు హీరోయిన్‌ ఫిక్స్‌

Sara Ali Khan In Temper Remake - Sakshi

ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన టెంపర్ సినిమా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌లో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో సింబా పేరుతో  సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమాకు హీరోయిన్‌ను ఫైనల్‌ చేశారు.

ఈ సినిమాలో హీరోయిన్‌ గా జాన్వీ కపూర్‌ నటించబోతోందన్న ప్రచారం జరిగింది. తరువాత ప్రియా ప్రకాష్ వారియర్‌ పేరు తెరమీదకు వచ్చింది. ఈ రూమర్స్‌ చెక్‌ పెడుతూ చిత్రయూనిట్ సారా అలీఖాన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్‌ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురైన సారా ప్రస్తుతం కేదార్‌నాథ్ షూటింగ్‌లో బిజీగా ఉంది. సింబాతో సారా ఎంట్రీ కన్ఫామ్ అయ్యింది. ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ 28న విడుదల కానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top