డిసెంబర్‌ 7న ‘కేదార్‌నాథ్’ | Sara Ali Khan And Sushant Singh Rajput Kedarnath Teaser | Sakshi
Sakshi News home page

Oct 30 2018 12:26 PM | Updated on Oct 30 2018 1:08 PM

Sara Ali Khan And Sushant Singh Rajput Kedarnath Teaser - Sakshi

బాలీవుడ్ సీనియ‌ర్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా కేదార్‌నాథ్‌. 2013లో ఉత్తరాదిని, ముఖ్యంగా కేదార్‌నాథ్ ప్రాంతంలో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాకు అభిషేక్‌ కపూర్‌ దర్శకుడు. సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ అయ్యింది.

ఆలయ పరిసరాల్లో భారీగా నీరు చేరటం సహాయక చర్యలకు సంబంధించిన విజువల్స్‌తో టీజర్‌ను థ్రిల్లింగ్‌ గా కట్‌ చేశారు. ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాను గౌడీకుండ్‌ నుంచి కేదార్‌నాథ్ మధ్య ప్రాంతంలో చిత్రీకరించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా డిసెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement