తెలుగులో లస్ట్‌ స్టోరీస్‌

Sankalp Reddy Direct Netflix Super Hit Web Series Lust Stories - Sakshi

‘ఘాజీ, అంతరిక్షం’ వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సంకల్ప్‌రెడ్డి. మూడో చిత్రాన్ని బాలీవుడ్‌లో చేసే అవకాశం అందుకున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు లాక్‌ చేసిన ఆయన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక పనిలో ఉన్నారు. మరోవైపు ఆయన నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఓ వెబ్‌ సిరీస్‌కి దర్శకత్వం వహించనున్నారట. గత ఏడాది బాలీవుడ్‌లో సంచలనం రేపిన ‘లస్ట్‌ స్టోరీస్‌’ తెలుగు వర్షన్‌ని సంకల్ప్‌ డైరెక్ట్‌ చేయనున్నారు. బాలీవుడ్‌లో నాలుగు విభాగాల్లో తెరకెక్కిన ‘లస్ట్‌ స్టోరీస్‌’ కి కరణ్‌ జోహార్, అనురాగ్‌ కశ్యప్, జోయా అక్తర్, దిబాకర్‌ బెనర్జీ దర్శకత్వం వహించారు.

విక్కీ కౌశల్, కియారా అద్వానీ, మనీషా కోయిరాలా, భూమి ఫడ్నేకర్, సంజయ్‌ కపూర్, రాధికా ఆప్టే తదితరులు నటించిన ‘లస్ట్‌ స్టోరీస్‌’ తొలి భాగం గత ఏడాది జూన్‌ 15న ప్రారంభమై బాలీవుడ్‌లో సంచలనాలు సృష్టించింది. బాలీవుడ్‌ ‘లస్ట్‌ స్టోరీస్‌’ ని నిర్మించిన ఆర్‌ఎస్‌వీపీ ప్రొడక్షన్‌ హౌస్‌ తెలుగులోనూ నిర్మించనుంది. నాలుగు భాగాలుగా తెరకెక్కనున్న ఈ వెబ్‌ సిరీస్‌లో ఓ డైరెక్టర్‌గా సంకల్ప్‌ రెడ్డి ఫిక్సయ్యారు. మరో ముగ్గురు డైరెక్టర్స్‌ ఎవరన్నది ప్రకటించాల్సి ఉంది. సంకల్ప్‌ దర్శకత్వం వహిస్తున్న ఎపిసోడ్‌ మార్చి 2020కి ముగుస్తుంది. ఈ ‘లస్ట్‌ స్టోరీస్‌’ తెలుగులో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందే వేచి చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top