రానున్న రోజుల్లో ఎలా ఉండ‌బోతుందో..

Sanjay Kapoor Says Actors Cant Face Camera With Mask - Sakshi

ప‌లు రాష్ట్రాల్లోని ఆరెంజ్‌, గ్రీన్ జోన్ల‌లో లాక్‌డౌన్ స‌డ‌లింపులు అమ‌ల్లోకి వ‌చ్చాయి. ప‌లు ప‌రిశ్ర‌మ‌లు కొన్ని నిబంధ‌న‌లు పాటిస్తూ తిరిగి యథావిధిగా ప‌ని చేసుకోవాల్సి ఉంటుంది. మ‌రి చిత్ర ప‌రిశ్ర‌మ‌? సామాజిక దూరం పాటించ‌డం, ఫేస్ మాస్క్ ధ‌రించ‌డం, ప‌రిమిత వ్య‌క్తుల‌తో ప‌నిచేయ‌డం ఎంత‌వ‌ర‌కు జ‌రిగే ప‌ని? ఇది అసాధ్య‌మంటున్నాడు బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ క‌పూర్‌. క‌రోనా కార‌ణంగా ఇప్ప‌టికే షూటింగ్‌లు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయి. సినిమాలు వాయిదా ప‌డ్డాయి. క‌రోనా త‌ర్వాత ప‌రిస్థితులు ఎంత‌లా మార‌నున్నాయో త‌ల‌చుకుంటేనే ఆందోళ‌గా ఉందంటున్నాడు‌.  తిరిగి సెట్స్‌కు వెళ్లాలంటే త‌న‌కూ అభ‌ద్ర‌త‌గానే ఉందంటున్నాడు. (‘నాకు కరోనా రాలేదు.. వచ్చింది మలేరియా’)

"లాక్‌డౌన్ త‌ర్వాత‌ న‌టుడు ఫేస్ మాస్క్ లేకుండానే కెమెరా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. యాక్ష‌న్ స‌న్నివేశాల నుంచి ఇత‌రుల‌తో అత్యంత స‌న్నిహితంగా మెల‌గ‌డం వ‌ర‌కు అన్నీ ఉంటాయి. వీట‌న్నింటినీ ఇండ‌స్ట్రీ ఎలా ఎదుర్కొంటుందా అని ఆలోచిస్తున్నాను. ఇక మా ఇంటి విష‌యానికొస్తే.. నా పిల్ల‌లు ఇప్పుడు బుద్ధిగా ఆలోచిస్తున్నారు. నా కుమార్తె మా ఇంటి ఎదురుగా ఉన్న ఇంటికి వెళ్లి అక్క‌డ త‌న స్నేహితురాలితో ఆడుకునేది. కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుని అక్క‌డికి వెళ్ల‌డ‌మే మానేసింది. లాక్‌డౌన్ త‌న ఇంట్లో ఎన్నో పాజిటివ్ అంశాల‌ను నేర్పించింది" అంటున్నాడు సంజ‌య్ క‌పూర్‌. కాగా ఆయ‌న సినీ ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చి నేటితో 25 వ‌సంతాలు పూర్త‌య్యాయి. (బుల్‌ బుల్‌ మ్యారేజ్‌ హాల్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top