బర్త్‌డే ప్లాన్‌ రెడీ

Sanjay Dutt starrer Saheb Biwi Aur Gangster 3 to release on July 27 - Sakshi

బాలీవుడ్‌ స్పైస్‌

బర్త్‌డేకి కేక్‌ కట్‌ చేయడంతోపాటు థియేటర్‌లో బుల్లెట్స్‌ను పేల్చుతానంటున్నారు బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌. తిగ్‌మాన్షు థూలియా దర్శకత్వంలో సంజయ్‌దత్, జిమ్మి షెర్గిల్, మహి గిల్, చిత్రాంగద సింగ్‌ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘సాహెబ్‌ బిబీ ఔర్‌ గ్యాంగ్‌స్టర్‌ 3’.

2011లో వచ్చిన ‘సాహెబ్‌ బీబీ ఔర్‌ గ్యాంగ్‌స్టర్‌’, 2013లో ‘సాహెబ్‌ బీబీ ఔర్‌ గ్యాంగ్‌స్టర్‌ రిటర్న్స్‌’లను డైరెక్ట్‌ చేసిన థూలియా దర్శకత్వంలో రూపొందుతున్న మూడోపార్ట్‌ ఇది. సినిమా షూటింగ్‌ ఆల్మోస్ట్‌ కంప్లీట్‌ అయ్యిందని బాలీవుడ్‌ సమాచారం. అయినా ఇప్పుడు రిలీజ్‌ చేయరట. మంచి డేట్‌ కోసం చూస్తున్నారని సమాచారం. ఆ డేట్‌ సంజయ్‌ దత్‌ బర్త్‌డే డేట్‌ అని భోగట్టా. జూలై 29న సంజూ బాబా బర్త్‌డే. అదే రోజున ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారట.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top