సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో వస్తోన్న వెబ్ సిరీస్ ఆపరేషన్ సఫేద్ సాగర్(Operation Safed Sagar). కార్గిల్ యుద్ధ నేపథ్యంలో ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కార్గిల్ వార్ టైమ్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్‌పై ఈ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్‌కు ఓని సేన్ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్‌లో జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. కార్గిల్ సమయంలో భారత వైమానిక దళం 47 రోజుల పాటు ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ సఫేద్ సాగర్ వచ్చే ఏడాదిలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో మిహిర్ అహుజా, తారుక్ రైనా, అర్నవ్ భాసిన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


