మరోసారి చైతూ - సామ్‌! | Samantha is Planning to Act with Naga Chaitanya Once Again | Sakshi
Sakshi News home page

మరోసారి చైతూ - సామ్‌!

Apr 13 2019 12:53 PM | Updated on Apr 13 2019 12:53 PM

Samantha is Planning to Act with Naga Chaitanya Once Again - Sakshi

రీల్‌ పెయిర్‌గా సక్సెస్‌ అయి తరువాత రియల్‌ లైఫ్‌లోనూ బెస్ట్ పెయిర్‌ అనిపించుకున్న జంట నాగ చైతన్య, సమంత. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన ఈ జంట తరువాత మనం, ఆటోనగర్‌ సూర్య లాంటి సినిమాలతోనూ ఆకట్టుకున్నారు. సక్సెస్‌ను పక్కన పెడితే చైతూ సామ్‌ల కెమిస్ట్రీకి మాత్రం ఫుల్‌ మార్కపడ్డాయి.

తాజాగా మజిలీ సినిమాతో మరోసారి మ్యాజిక్‌ చేశారు ఈ జోడి. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మజిలీ ఘన విజయం సాధించటమే కాదు ఇప్పటికే  50 కోట్ల క్లబ్‌లో చేరి సత్తా చాటింది. దీంతో మరో సినిమాలో కలిసి నటించేందుకు చైతూ, సమంతలు రెడీ అవుతున్నారట. 2019లోనే వీరి కాంబినేషన్‌లో మరో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందన్న టాక్‌ వినిపిస్తోంది. మరి మరోసారి అక్కినేని జంట మ్యాజిక్‌ చేస్తుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement