సమంతకు ఫుడ్ పాయిజన్!
గతంలో ఎన్నడూ లేనంతగా తనకు మంగళవారం సినిమా కష్టాలు ఎదురయ్యాయని...
గతంలో ఎన్నడూ లేనంతగా తనకు మంగళవారం సినిమా కష్టాలు ఎదురయ్యాయని దక్షిణాది సినీతార సమంత సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో వెల్లడించింది. ఫుడ్ పాయిజన్ కావడంతో తాను స్వల్ప అనారోగ్యానికి గురయ్యాను.
అంతేకాకుండా ట్రాన్సిట్ లో తన బ్యాగ్ ను పొగొట్టుకున్నాను అని ట్విటర్ లో వెల్లడించింది. అనారోగ్యం, ఫ్లయిట్ ఆలస్యం కావడంతో తాను అంజాన్ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొనడం లేదని సమంత తెలిపింది.
సూర్య సరసన అంజాన్ చిత్రంలో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం అంజాన్ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది.