బ్రిట్నీ స్పియర్స్‌ మోసపోయిందా? | Is Sam Asghari Cheating on Britney Spears by Using Dating App? See His Response | Sakshi
Sakshi News home page

బ్రిట్నీ స్పియర్స్‌ మోసపోయిందా?

Feb 5 2018 1:28 AM | Updated on Feb 5 2018 1:28 AM

Is Sam Asghari Cheating on Britney Spears by Using Dating App? See His Response - Sakshi

బ్రిట్నీ స్పియర్స్, శామ్‌ అస్గరీ

పాపులర్‌ సింగర్‌ బ్రిట్నీ స్పియర్స్‌ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. 2010 నుంచీ కొన్నేళ్ల పాటు ఇటు పర్సనల్‌గా, కెరీర్‌ పరంగా చాలా కష్టాలనే ఎదుర్కొన్న ఆమె, ఇప్పుడిప్పుడే అన్నీ సెట్‌ చేస్కొని చక్కగా లైఫ్‌ని లీడ్‌ చేస్తోంది. ముఖ్యంగా శామ్‌ అస్గరీతో ప్రేమలో పడ్డాక బ్రిట్నీ లైఫంతా మారిపోయింది. ఇప్పుడు ఊహించనంత సంతోషంగా రోజులను గడుపుతోందామె. ఎక్కడ చూసినా ఈ జంటే కనిపిస్తారు. బ్రిట్నీకేమో 36 ఏళ్లు. శామ్‌ అస్గరీకి 23 ఏళ్లు. వయసులో చాలా తేడా ఉన్నా ఇద్దరూ చూడముచ్చటగా కనిపిస్తారు. అది వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టంగా ప్రేమించుకోవడం వల్లేనేమో! కపుల్‌ గోల్స్‌ క్యాటగిరీలో వీళ్లనూ పడేస్తుంటారు నెటిజన్స్‌. ఇంతవరకూ బాగానే ఉంది. ఇక్కడే తాజాగా బయటకొస్తోన్న ఓ వార్త కొంత తేడాగా ఉంది.

ఓవైపు బ్రిట్నీతో ప్రేమలో ఉంటూనే, మరోవైపు వేరే అమ్మాయిలతోనూ డేట్‌ చేస్తున్నాడట శామ్‌. ఇదెంతవరకూ నిజమన్నది ఎవ్వరికీ తెలియదు కానీ డేటింగ్‌ యాప్స్‌లో శామ్‌ అఫీషియల్‌ అకౌంట్స్‌ ఉన్నాయని, బ్రిట్నీతో పాటుగా, అతను వేరే అమ్మాయిల వెంట కూడా పడుతున్నాడని ఈ అకౌంట్స్‌ చూపించి, చెబుతున్నారు నెటిజన్లు. బ్రిట్నీ అంత పాపులర్‌ కాదు  శామ్‌. మోడల్‌గా ఇప్పుడే కెరీర్‌లో వృద్ధిలోకి వస్తున్నాడు. అలాంటి వాడు బ్రిట్నీనే మోసం చేస్తున్నాడా? బ్రిట్నీ నిజంగానే ప్రేమలో మోసపోతోందా? కాలమే సమాధానం చెప్పాలి. శామ్‌ అయితే తాను అలాంటి వాడిని కానని క్లీన్‌ చీట్‌ ఇచ్చుకుంటున్నాడు తనకు తానే! చూడాలి... ఈ ప్రేమకథ ఎటు వెళుతుందో!!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement