పోటీకి సై! | Salman Khan vs Aishwarya Rai Bachchan: Fanney Khan to clash with Race 3 on Eid 2018 | Sakshi
Sakshi News home page

పోటీకి సై!

Nov 12 2017 12:28 AM | Updated on Nov 12 2017 12:28 AM

Salman Khan vs Aishwarya Rai Bachchan: Fanney Khan to clash with Race 3 on Eid 2018 - Sakshi

ఆల్మోస్ట్‌ 15 ఏళ్ల క్రితం లవ్‌లో ఉన్న కండల వీరుడు సల్మాన్‌ఖాన్, అందాల భామ ఐశ్యర్యా రాయ్‌ ఏవో రీజన్స్‌ వల్ల బ్రేకప్‌  చెప్పుకున్నారని బాలీవుడ్‌ కథనాలు చదివాం. ఆ తర్వాత 2007లో అభిషేక్‌ బచ్చన్‌ను ఐశ్యర్య వివాహం చేసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు సల్మాన్, ఐశ్యర్యల మధ్య వార్‌ మొదలైంది. ఏవేవో ఊహించుకోకండి. వార్‌ పర్సనల్‌గా కాదు. ప్రొఫెషనల్‌గా. వీరిద్దరూ వచ్చే ఏడాది బాక్సాఫీస్‌ వార్‌కి సై అంటున్నారు. అతుల్‌ మంజ్రేకర్‌ దర్శకత్వంలో ఐశ్యర్యా రాయ్‌ లీడ్‌ రోల్‌లో ‘ఫ్యాన్నీ ఖాన్‌’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

అనీల్‌కపూర్, రాజ్‌కుమార్‌ రావు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్‌ చేయనున్నట్లు ఈ సినిమా నిర్మాతలు అర్జున్‌ ఎన్‌.కపూర్, ప్రీమా అరోరా, భూషన్‌ కుమార్, రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మెహ్రా తెలిపారు. ఈ పండగకే రావడానికి రెడీ అవుతున్నట్లు ఆ మధ్య సల్మాన్‌ ఖాన్‌ ‘రేస్‌ 3’ బృందం ప్రకటించింది. సల్లూభాయ్‌కి బాక్సాఫీసు దగ్గర అచ్చొచ్చిన పండగ రంజాన్‌. ఒక్క 2013 మినహాయించి 2009 నుంచి మొన్నీ మధ్య 2017 వరకు ప్రతి రంజాన్‌ పండక్కి సల్మాన్‌ సినిమా వచ్చింది.

‘వాంటెడ్, దబాంగ్, బాడీగార్డ్, ఎక్‌ థా టైగర్, కిక్, భజరంగీ భాయిజాన్, సుల్తాన్, ట్యూబ్‌లైట్‌ (2017)’ సినిమాలు రంజాన్‌కు విడుదలైనవే. 2018 మిస్సవుతుందని అనుకున్నారు. ఎందుకంటే  సల్మాన్‌ ‘భరత్‌’ సినిమాను 2019లో రంజాన్‌కు రిలీజ్‌ చేయబోతున్నట్లు చిత్రదర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ ప్రకటించారు. సో...∙2018 రంజాన్‌కి సల్లుభాయ్‌ సినిమా లేనట్లే అని ఫిక్సవుతున్న తరుణంలో ఈ కండల వీరుడు హీరోగా రూపొందుతోన్న ‘రేస్‌ 3’ సినిమాను రంజాన్‌కు రిలీజ్‌ చేయనున్నట్లు దర్శకుడు రెమో డిసౌజా తెలిపారు. ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల 9న మొదలైంది. ఒకవైపు కలసి వచ్చిన పండక్కి రావడానికి సల్మాన్‌ రెడీ అవుతోంటే, ఐశ్వర్యా రాయ్‌ ‘ఫ్యానీ ఖాన్‌’తో రేస్‌లో నిలబడ్డారు. మరి... ఎక్స్‌ లవర్స్‌లో గెలుపు ఎవరిది? వేచి చూద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement