గాడ్‌ఫాదర్ ఆశీస్సులతో... | Salman Khan reunites with Sneha Ullal 'Lucky | Sakshi
Sakshi News home page

గాడ్‌ఫాదర్ ఆశీస్సులతో...

Apr 20 2014 12:41 AM | Updated on Sep 2 2017 6:15 AM

గాడ్‌ఫాదర్ ఆశీస్సులతో...

గాడ్‌ఫాదర్ ఆశీస్సులతో...

తొలిచూపులోనే అందరి దృష్టినీ ఆకర్షించిన తార స్నేహా ఉల్లాల్. తొమ్మిదేళ్ల క్రితం ‘లక్కీ’ సినిమాతో తెరంగేట్రం చేశారామె. ఆ సినిమా సమయంలో అందరూ ఆమెను

తొలిచూపులోనే అందరి దృష్టినీ ఆకర్షించిన తార స్నేహా ఉల్లాల్. తొమ్మిదేళ్ల క్రితం ‘లక్కీ’ సినిమాతో తెరంగేట్రం చేశారామె. ఆ సినిమా సమయంలో అందరూ ఆమెను నిజంగా లక్కీ అన్నారు. ఐశ్వర్యారాయ్ పోలికలుండటం ఓ లక్. సల్మాన్‌ఖాన్ లాంటి సూపర్‌స్టార్ గాడ్‌ఫాదర్ అవ్వడం మరో లక్. తొలి సినిమాకే ఎక్కడలేని ప్రచారం లభించడం ఇంకో లక్. ఇలా స్నేహకు అన్నీ లక్కులే అన్నారంతా. తీరా సినిమా విడుదలయ్యాక  ఆమెకు లక్ అంతగా కలిసి రాలేదు. ఇక చేసేది లేక దక్షిణాది బాట పట్టారామె. ఇక్కడ కూడా అర కొర విజయాలే దక్కడంతో మళ్లీ ముంబై చేరుకున్నారామె.
 
  ఇటీవల సల్మాన్... ‘బెల్లీ డాన్స్ నేర్చుకో.. నీ కెరీర్‌కి అది బాగా ఉపయోగపడుతుంది’ అని స్నేహకు ఓ సలహా ఇచ్చారట. గాడ్‌ఫాదర్ మాటను పాటిస్తూ ‘బెల్లీ డాన్స్’లో ప్రావీణ్యం సంపాదించి, సల్మాన్‌ని కలిశారట స్నేహా ఉల్లాల్. ఆమెలోని పట్టుదల సల్మాన్‌ని కట్టిపడేసిందట. తత్ఫలితంగానే... ‘బేజుబాన్’ అనే సినిమాలో కథానాయికగా నటించే బంపర్ ఆఫర్ స్నేహను వరించింది. వచ్చే వారమే ఈ సినిమా సెట్స్‌కి వెళ్లనుందట. ఇది అద్భుతమైన ప్రేమకథ అని, ఈ అవకాశం రావడానికి కారకుడైన తన గాడ్‌ఫాదర్ సల్మాన్‌కి కృతజ్ఞతలని తెగ సంబరపడిపోతోంది స్నేహా ఉల్లాల్. మరి స్నేహ బాలీవుడ్ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement