కుటుంబ సభ్యులతో కోర్టుకు వెళ్లిన సల్మాన్ | Salman Khan leaves his Bandra residence for sessions court | Sakshi
Sakshi News home page

కుటుంబ సభ్యులతో కోర్టుకు వెళ్లిన సల్మాన్

May 6 2015 10:18 AM | Updated on Sep 3 2017 1:33 AM

కుటుంబ సభ్యులతో కోర్టుకు వెళ్లిన సల్మాన్

కుటుంబ సభ్యులతో కోర్టుకు వెళ్లిన సల్మాన్

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులతో కలసి బుధవారం ఉదయం ముంబై సెషన్స్ కోర్టుకు వెళ్లారు.

ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులతో కలసి బుధవారం ఉదయం ముంబై సెషన్స్ కోర్టుకు వెళ్లారు. బాంద్రాలోని ఆయన నివాసం నుంచి బయల్దేరారు. హిట్ అండ్ రన్ కేసులో కాసేపట్లో తీర్పు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఉదయం 11.15 గంటలకు ముంబై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డీడబ్ల్యూ దేశ్‌పాండే వెలువరించనున్నారు.  నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. కోర్టు ఆవరణలో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా ఇప్పుడు బాలీవుడ్ అంతా ఉత్కంఠ.. పైకి చెప్పకున్నా ఒకటే విషయం అందరి మధ్య చర్చ. సల్మాన్ఖాన్ జైలు గోడల మధ్యకు వెళతారా.. లేక ఉపశమనం పొంది తిరిగి జనాల్లోకి మాములు వ్యక్తిగా వస్తారా అని మీడియా కూడా తమ కెమెరా కన్నులతో ఎదురుచూస్తోంది. హిట్ అండ్ రన్ కేసులో తుది తీర్పును సెషన్స్ కోర్టు మరికొద్ది సేపట్లో తుదితీర్పు వెల్లడించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement