పంచభూతాలే ఈ సినిమా చేయించాయి | Sakshyam Audio Launch Event | Sakshi
Sakshi News home page

పంచభూతాలే ఈ సినిమా చేయించాయి

Jul 9 2018 12:30 AM | Updated on Aug 22 2019 9:35 AM

Sakshyam Audio Launch Event  - Sakshi

శ్రీవాస్, పూజా హెగ్డే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంతోష్, అభిషేక్‌ నామా

‘‘నేను మాట్లాడాల్సిందంతా నా థియేట్రికల్‌ ట్రైలర్, పంచభూతాల సాంగ్‌ మాట్లాడేశాయి. కొత్త కథలను ఆడియన్స్‌ ఆదరిస్తున్నారని ఈ స్క్రిప్ట్‌ని ఎంచుకున్నాను. పంచభూతాల సపోర్ట్‌తోనే ఈ సినిమా జరిగిందనుకుంటాను. పంచభూతాలే నాతో ఈ సినిమా చేయించాయి అనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు శ్రీవాస్‌. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్‌ దర్శకత్వంలో అభిషేక్‌ నామా నిర్మించిన చిత్రం ‘సాక్ష్యం’. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ హైదరాబాద్‌లో జరిగింది.

ట్రైలర్‌ను, ఆడియో సీడీలను పార్లమెంట్‌ సభ్యులు, టీ న్యూస్‌ ఎండీ సంతోశ్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీవాస్‌ మాట్లాడుతూ –‘‘నిర్మాతలు చాలామంది ఉంటారు. కానీ మేకర్స్‌ చాలా తక్కువ మంది ఉంటారు. బడ్జెట్‌ ఎక్కువైనా సరే నిర్మాత అభిషేక్‌ కథను నమ్మి కాంప్రమైజ్‌ అవ్వలేదు. హర్షవర్ధన్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. ఆర్థర్‌ విల్సన్‌ కెమెరా, చంటిగారి ఎడిటింగ్, అనంత  శ్రీరామ్‌ లిరిక్స్‌ హైలైట్స్‌గా నిలుస్తాయి. విలన్స్‌ చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలని జగపతిబాబు, రవికిషన్, అశుతోష్‌ రాణాని సెలెక్ట్‌ చేసుకున్నాం.

ఒక దర్శకుడికి శ్రీనివాస్‌లాంటి హీరో దొరికితే హ్యాపీగా ఉంటుంది. ఏం చెప్పినా చేసేవాడు. ఫ్యూచర్‌లో పెద్ద స్థాయికి వెళ్తాడు. పూజా హెగ్డే సౌందర్యలహరి క్యారెక్టర్‌కి మౌల్డ్‌ అయిపోయింది’’ అన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్‌ మాట్లాడుతూ – ‘‘ఇంత మంచి సినిమాను నాకిచ్చినందుకు శ్రీవాస్‌ గారికి థ్యాంక్స్‌. కెరీర్‌ స్టార్టింగ్‌లోనే ఇలాంటి సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. ఇలాంటి కథను నమ్మి నిర్మించినందుకు నిర్మాత అభిషేక్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘శ్రీవాస్‌గారు ఇందులో డిఫరెంట్‌ రోల్‌ ఇచ్చారు.  సాయి చాలా హార్డ్‌వర్కింగ్‌ పర్సన్‌.

అభిషేక్‌ గారికి చాలా డబ్బులు రావాలి’’ అన్నారు పూజా హెగ్డే. ‘‘ఇలాంటి ప్రాజెక్ట్‌ నాకు ఇచ్చినందుకు దర్శక–నిర్మాతలకు రుణపడి ఉంటాను. ఇది నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. అనంత శ్రీరామ్‌గారి సపోర్ట్‌ లేకపోతే పంచభూతాల సాంగ్‌ ఇలా వచ్చేది కాదు’’ అన్నారు హర్షవర్ధన్‌. ‘‘సాంగ్‌ చూడగానే ‘లెజెండ్‌’ సినిమా గుర్తొచ్చింది. ఈ సినిమా కూడా ఆ రేంజ్‌ బ్లాక్‌బస్టర్‌ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అనిల్‌ సుంకర.  ‘‘శ్రీనివాస్‌తో ఓ సినిమా తీశాను. చాలా ఎనర్జిటిక్‌. కోపరేటివ్‌. ఈ సినిమా విజువల్‌ ఫీస్ట్‌లా ఉంది’’ అన్నారు భీమనేని శ్రీనివాస్‌.  ‘‘సినిమాను ఇష్టపడే వ్యక్తి శ్రీవాస్‌. బ్లాక్‌బస్టర్‌ కొట్టి టాప్‌ రేంజ్‌కి వెళ్లాలని కోరుకుంటున్నాను. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు దశరథ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement