మహిళలు అధైర్యపడొద్దు 

Sakshi Interview With Heroine Preeti Singh

నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది..

జర్నలిజమంటే ఇష్టం

స్టూవర్టుపురం’ హీరోయిన్‌ ప్రీతిసింగ్‌

మంచిర్యాలక్రైం : ‘మహిళలు అధైర్యపడొద్దు.. వారికి తమకిష్టమైన రంగాల్లో రాణించేందుకు చాలా అవకాశాలున్నాయి..’ అని స్టూవర్టుపురం సినిమా హీరోయిన్‌ ప్రీతి సింగ్‌ సోమవారం మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

సాక్షి: సినిమా రంగంలోకి ఎలా అడుగు పెట్టారు?
ప్రీతి: చదువుతూనే మోడలింగ్‌లో అడుగుపెట్టాను. అలా యాడ్స్‌ చేస్తున్నప్పుడే మొదటిసారి ‘మ్యాగ్నెట్‌’ చిత్రంలో సైడ్‌ క్యారెక్టర్‌ చేశాను. ఈ క్రమంలోనే గూఢచారి నంబర్‌ వన్‌ సినిమాలో సైడ్‌ హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. ఈ క్యారెక్టర్‌కు మంచి పేరు లభించింది. తర్వాత మంచిర్యాల జిల్లాకు చెందిన డైరెక్టర్‌ ఏకాకి సత్యనారాయణ, ప్రొడ్యూసర్‌ రంజిత్‌కుమార్‌ తీస్తున్న స్టూవర్టుపురంలో హీరోయిన్‌గా అవకాశమిచ్చారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.
సాక్షి: మీ విద్యాభ్యాసం ఎక్కడ సాగింది?
ప్రీతి: నా చదువంతా చెన్నైలోనే సాగింది. డిగ్రీ తరువాత పీజీ, ఆ తర్వాత జర్నలిజం చేశాను. వ్యాపార నిమిత్తం అమ్మనాన్నలతో కలకత్తాకు వెళ్లిపోయా. ప్రస్తుతం అక్కడే స్థిరపడ్డాం. చిన్నతనం నుంచి జర్నలిజంపై మక్కువ ఉండేది. మోడలింగ్‌ చేస్తున్న సమయంలో అవకాశాలు రావడంతో సినిమాలపై దృష్టి పెట్టాను.
సాక్షి: ఎలాంటి సినిమాలు చేయలనకుంటున్నారు?
ప్రీతి:: ఇలాంటి సినిమానే చేయాలనేం లేదు. గుర్తింపు తెచ్చే ఏ క్యారెక్టరైనా చేస్తాను. ప్రేక్షకులను మెప్పించే ఏ పాత్ర చేయడానికైనా నేను సిద్ధం.
సాక్షి: మొదటిసారి కెమెరా ముందు ఎలా     ఫీలయ్యారు?
ప్రీతి: మోడలింగ్‌ చేసిన అనుభవం ఉంది కాబట్టి పెద్దగా భయం అనిపించలేదు. యూనిట్‌ సభ్యులు హీరో, హీరోయిన్‌ అందరూ చాలా ప్రోత్సహాన్నిచ్చారు. కొంచెం కష్టమైనా ఇష్టమైన రంగం కాబట్టి ఇష్టపడే చేశాను.
సాక్షి: మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై మీరేమంటారు?
ప్రీతి: మహిళలపై జరుగుతున్న దాడులు బాధాకరం. మహళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. చిన్నచూపు పోవడం లేదు. ఈ దాడులు నిరోధించడానికి చట్టాలు కఠినంగా అమలు చేయాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top