ఈసారి తెలుగుతో పాటు తమిళ్‌ కూడా! | Sai Pallavi to star opposite Dhanush in Maari 2 | Sakshi
Sakshi News home page

ఈసారి తెలుగుతో పాటు తమిళ్‌ కూడా!

Sep 29 2017 1:01 AM | Updated on Sep 29 2017 1:01 AM

Sai Pallavi to star opposite Dhanush in Maari 2

భాను‘మతి’ పోగొట్టింది. కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అదేనండి.. ‘ఫిదా’లో భానుమతిగా సాయి పల్లవి చేసిన సందడి గురించే చెబుతున్నాం. అందం, అభినయంతో అందర్నీ ఫిదా చేసేసిన సాయి పల్లవి ఇప్పుడు బిజీ స్టార్‌. ప్రస్తుతం నాని సరసన ‘ఎంసిఎ’లో నటిస్తోన్న ఈ బ్యూటీ మరోవైపు తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ‘కణం’లో చేస్తున్నారు.

తాజాగా మరో ద్విభాషా చిత్రం ఒప్పుకున్నారు. ఇటు తెలుగు అటు తమిళ అభిమానులను ఆనందపరిచే వార్త ఇది. సాయి పల్లవి ఒప్పుకున్న సినిమా విషయానికొస్తే.. ధనుష్‌ కెరీర్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘మారి’ ఒకటి. ప్రస్తుతం ‘మారి–2’కి శ్రీకారం చుట్టారు. ఇందులో ధనుష్‌ సరసన సాయి పల్లవి కథానాయికగా నటించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సీక్వెల్‌ కూడా బాలాజీ మోహన్‌ దర్శకత్వంలోనే తెరకెక్కనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement