ఒక్క చిత్రంతోనే..

Sai Pallavi About Her Movie Industry Rumours - Sakshi

సినిమా: ఒక్క చిత్రంతోనే దేశ వ్యాప్తి చెందిన నటిని తాను అంటోంది నటి సాయిపల్లవి.  నిజమే ప్రేమమ్‌ అనే ఒక్క మలయాళ చిత్రంతోనే ఈ తమిళ పొన్ను పాపులర్‌ అయ్యింది. ఆ చిత్రం తరువాత తెలుగు, తమిళం భాషల్లోనూ నటించే అవకాశాలను అందుకుంటోంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో తొలి చిత్రం దయా కాస్త నిరాశ పరిచినా, ధనుష్‌తో రొమాన్స్‌ చేసిన మారి–2 కమర్షియల్‌గా ఓకే అనిపించుకోవడం సాయిపల్లవికి కాస్త ఊరటనిచ్చింది. ఇప్పుడు సూర్యతో జత కడుతున్న ఎన్‌జీకే చిత్రం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ జాణ గురించి వదంతులూ బాగానే ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా సాయిపల్లవి బందాను తట్టుకోలేకపోతున్నామని, ఆమెను కలిసి కథ వినిపించడం కష్టతరంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీనికి స్పందించిన సాయిపల్లవి తాను ఒక సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయినని, సినీ వెలుగు అన్నది అనూహ్యంగా తనపై పడిందేనని చెప్పింది. ఒక్క చిత్రంతోనే నటిగా దేశ వ్యాప్తి చెందానని అంది. అయితే ఎప్పుడూ తాను బందా చూపలేదని చెప్పింది. అంతే కాదు గర్వం ప్రదర్శంచిందీ లేదని అంది. తాను బందా చూపితే రేపే మరో ప్రతిభావంతురాలైన నటి ఇతర నటీమణులను వెనక్కి నెట్టేస్తుందని పేర్కొంది. ఆ విషయం తెలిసిన నటిగా తానెప్పుడూ బందా చూపనని చెప్పింది. ఎవరైనా సరైన విధంగా తనను కలిసి మాట్లాడితే వారు చెప్పే కథలను విని తనకు నచ్చితే నటిస్తానని చెప్పింది. సినిమాకు సంబంధించినంత వరకూ ఏదీ నిరంతరం కాదని అంది. ఈ రోజు సాధారణ యువతిగా ఉన్న వారు రేపు ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అని నటి సాయిపల్లవి పేర్కొంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top