మానవత్వం పరిమళించిన వేళ... | Sakshi
Sakshi News home page

మానవత్వం పరిమళించిన వేళ...

Published Wed, Feb 4 2015 11:45 PM

మానవత్వం పరిమళించిన వేళ...

మానవత్వం అందరిలోనూ ఉంటుంది. కష్టంలో ఉండే తోటివారికి సాయం చేసినప్పుడు ఆ మానవత్వం పరిమళిస్తుంది అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘సచిన్’. ‘టెండూల్కర్ కాదు’ అనేది ఉపశీర్షిక. సుభాష్ ప్రొడక్షన్స్ పతాకంపై తాయికొండ వెంకటేశ్ నిర్మించిన  ఈ చిత్రానికి ఎస్. మోహన్ దర్శకుడు. మాజీ భారత క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఇందులో క్రికెట్ కోచ్ పాత్ర పోషించారు.

సుహాసిని మణిరత్నం కీలక పాత్ర చేశారు. ఈ నెల 13న విడుదల కానున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘సుహాసిని గారికి ఈ పాత్ర నచ్చి ఎంతో అద్భుతంగా నటించారు. ‘అమ్మ’ చిత్రం తరువాత మళ్లీ ఆమెకు అవార్డు తెచ్చే చిత్రం ఇది’’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాజేష్ రామ్‌నాథ్ కెమెరా: డి. ప్రసాద్‌బాబు, ఎడిటింగ్: శివ.

Advertisement
 
Advertisement
 
Advertisement