సమ్మర్‌లోనే రెండో సామి? | Saamy 2 shoot to begin with Vikram and Trisha Krishnan in lead roles | Sakshi
Sakshi News home page

సమ్మర్‌లోనే రెండో సామి?

Aug 14 2017 1:04 AM | Updated on Sep 17 2017 5:29 PM

సమ్మర్‌లోనే రెండో సామి?

సమ్మర్‌లోనే రెండో సామి?

విక్రమ్, త్రిష జంటగా హరి దర్శకత్వంలో 14 ఏళ్ల క్రితం విడుదలైన ‘సామి’ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్‌ పరంగా కేక పుట్టించింది.

విక్రమ్, త్రిష జంటగా హరి దర్శకత్వంలో 14 ఏళ్ల క్రితం విడుదలైన ‘సామి’ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్‌ పరంగా కేక పుట్టించింది. ఆ తర్వాత ఈ సినిమాను తెలుగు, బెంగాలీ, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్‌ చేశారు. హిట్‌ ఫార్ములాతో తీసిన ‘సామి’కి స్పెషల్‌ క్రేజ్‌ ఉంది. ఈ సినిమాకి సీక్వెల్‌ చేయడానికి హరి–విక్రమ్‌ రెడీ అయ్యారట.

మొదటి భాగంలో లీడ్‌ రోల్‌ చేసిన త్రిష ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయనుండగా, కీర్తీ సురేశ్‌ను మెయిన్‌ హీరోయిన్‌గా తీసుకున్నారట. ఈ సినిమా షూటింగ్‌ సెప్టెంబర్‌ 15న స్టార్ట్‌ కానుందని∙టాక్‌. ‘సామి’ని సమ్మర్‌లో విడుదల చేశారు. సీక్వెల్‌ని కూడా వచ్చే సమ్మర్‌లో రిలీజ్‌కి టార్గెట్‌ చేశారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement