అందుకు విజయమే సాక్ష్యం | Saakshyam MovIe Success Meet | Sakshi
Sakshi News home page

అందుకు విజయమే సాక్ష్యం

Jul 30 2018 1:42 AM | Updated on Aug 22 2019 9:35 AM

Saakshyam MovIe Success Meet - Sakshi

సాయిమాధవ్‌ బుర్రా, శ్రీవాస్, పూజా హెగ్డే, బెల్లకొండ శ్రీనివాస్, అభిషేక్‌ నామా

‘‘కొత్త కాన్సెప్ట్‌ని ఆడియన్స్‌ ఎలా రీసివ్‌ చేసుకుంటారు? అనే ప్రశ్నకి కొత్త సక్సెస్‌తో సమాధానం చెబుతున్నారు. ఇంత పెద్ద కథను చెప్పడానికి మా టీమ్‌ అంతా చాలా కష్టపడ్డాం. థియేటర్‌ నుంచి ఆడియన్స్‌ ఎలా బయటకు రావాలని కోరుకున్నామో అదే ఫీలింగ్‌తో వస్తున్నారు’’ అని శ్రీవాస్‌ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సాక్ష్యం’. అభిషేక్‌ నామా నిర్మించారు. హర్షవర్థన్‌ రామేశ్వర్‌ సంగీత దర్శకుడు. ఈ సినిమా శుక్రవారం రిలీజ్‌ అయింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో శ్రీవాస్‌ మాట్లాడుతూ – ‘‘అభిషేక్‌గారు కాంప్రమైజ్‌ అవ్వకుండా నిర్మించారు. శ్రీనివాస్‌ ప్రాణం పెట్టి పని చేశాడు. అందరం కూడా కసిగా పని చేశాం. ట్రెండ్‌ని, ట్రెడీషన్‌ని కలిపి తీసిన చిత్రం ‘సాక్ష్యం’’ అన్నారు. ‘‘టీమ్‌ అందరి సపోర్ట్‌కి థ్యాంక్స్‌. చాలా కష్టపడి పని చేశాం. ఆడియన్స్‌ కూడా బాగా ఆదరిస్తున్నారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుందనడానికి సక్సెసే ‘సాక్ష్యం’. శ్రీవాస్‌గారు బాగా తెరకెక్కించారు. అభిషేక్‌గారు ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. సినిమా జనాల్లోకి వెళ్లిపోయింది’’ అన్నారు బెల్లంకొండ శ్రీనివాస్‌.

‘‘కొత్త కాన్సెప్ట్‌ని ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రతి ఫ్రేమ్‌లో రిచ్‌నెస్‌ కనిపిస్తోంది. సాయి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తను మంచి యాక్షన్‌ హీరో అవుతాడు’’ అన్నారు పూజా హెగ్డే. ‘‘సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌. అందరం సినిమాను ప్రేమించి పని చేశాం. థియేటర్స్‌ హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. హ్యాపీగా ఉంది’’ అన్నారు అభిషేక్‌ నామా. ‘‘ఈ విజయంలో భాగమైనందుకు గర్వంగా ఉంది. ఈ సినిమా చూస్తే తప్పు చేయడానికి భయపడతారు అనే భావన కలుగుతుంది’’ అన్నారు మాటల రచయిత సాయి మాధవ్‌ బుర్రా.

Advertisement
 
Advertisement
Advertisement