రొమాంటిక్ థ్రిల్లర్ | Romantic thriller Movie - Nenosta | Sakshi
Sakshi News home page

రొమాంటిక్ థ్రిల్లర్

Oct 9 2015 11:26 PM | Updated on Sep 3 2017 10:41 AM

రొమాంటిక్ థ్రిల్లర్

రొమాంటిక్ థ్రిల్లర్

జ్ఞాన్, సూర్య శ్రీనివాస్, పల్లవి హీరో, హీరోయిన్లుగా రైజింగ్ డ్రీమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రైజింగ్ టీమ్ నిర్మించిన చిత్రం ‘నేనొస్తా’.

జ్ఞాన్, సూర్య శ్రీనివాస్, పల్లవి హీరో, హీరోయిన్లుగా రైజింగ్ డ్రీమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రైజింగ్ టీమ్ నిర్మించిన చిత్రం ‘నేనొస్తా’. పరంధ్ కల్యాణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్ లోగోను డా. దాసరి నారాయణరావు ఆవిష్కరించారు. కొత్తవాళ్లు చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలనీ, టైటిల్, లోగో బాగున్నాయనీ దాసరి అన్నారు. పరంధ్ కల్యాణ్ మాట్లాడుతూ - ‘‘ఇదొక రొమాంటిక్ లవ్‌స్టోరి. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే థ్రిల్లర్ మూవీ. కథానుసారం ఉన్న ఐదు పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

త్వరలో ప్రచార చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు-రచనా సహకారం: బాషా మజహర్, సంగీతం: అనురాగ్ వినీల్, కెమెరా: శివారెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement