రొమాంటిక్ క్రైమ్ కథ | Romantic Crime Katha | Sakshi
Sakshi News home page

రొమాంటిక్ క్రైమ్ కథ

Aug 31 2015 1:03 AM | Updated on Sep 3 2017 8:25 AM

ప్రేమకథ నేపథ్యంలో క్రైమ్, కామెడీ సమాహారంతో రూపొందుతున్న చిత్రం ‘పారా హుషార్’. విజయ్, నేహాదేశ్ పాండే జంటగా ధృవ్ టాండేల్ నిర్మిస్తున్న

 ప్రేమకథ నేపథ్యంలో క్రైమ్, కామెడీ సమాహారంతో రూపొందుతున్న చిత్రం ‘పారా హుషార్’. విజయ్, నేహాదేశ్ పాండే జంటగా ధృవ్ టాండేల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ నిమ్మల దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘వైవిధ్యమైన కథాకథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మంచి మ్యూజికల్ మూవీగా దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే సినిమా ఇది. ’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కిరణ్ వెన్న, పాటలు: కాసర్ల శ్యామ్, కెమెరా: డి.వెంకటరాజు.
 

Advertisement

పోల్

Advertisement