ఎన్నాళ్ళకు ఓ రూమర్! | regina cassendra special inter view for soukyam movie | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్ళకు ఓ రూమర్!

Dec 23 2015 11:47 PM | Updated on Sep 3 2017 2:27 PM

ఎన్నాళ్ళకు ఓ రూమర్!

ఎన్నాళ్ళకు ఓ రూమర్!

రెజీనా మాతృభాష తమిళం అయినప్పటికీ, తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తూ ఇక్కడి అమ్మాయిలా అయిపోయారు.

రెజీనా మాతృభాష తమిళం అయినప్పటికీ, తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తూ ఇక్కడి అమ్మాయిలా అయిపోయారు. తెలుగులో మంచి గుర్తింపు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నారామె. గోపీచంద్ సరసన రెజీనా నటించిన ‘సౌఖ్యం’ నేడు తెరకొస్తోంది. ఏ.యస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వి. ఆనందప్రసాద్ నిర్మించారు. ఇక... రెజీనా కసండ్రా ఏమంటున్నారో తెలుసుకుందాం.

  •  రవికుమార్ దర్శకత్వంలో నేను చేసిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ నాది సీరియస్‌గా సాగే పాత్ర. మళ్లీ ఆయనతో చేసిన ఈ సినిమాలో నేను కామెడీ కూడా చేశాను. గోపీచంద్, రవికుమార్ చౌదరి, ఆనంద్‌ప్రసాద్ కాంబినేషన్ కాబట్టి, ఈ సినిమాకి అడగ్గానే ఒప్పేసుకున్నాను. భవ్య క్రియేషన్స్ యాక్టర్స్‌ను ట్రీట్ చేసే విధానం నాకు నచ్చుతుంది. గోపీచంద్ చాలా మంచి వ్యక్తి. ఈ చిత్రం ద్వారా మరో సక్సెస్ అందుకుంటాననే నమ్మకం ఉంది.
     
  •  ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు నేనింత బిజీ హీరోయిన్ అవుతానని అనుకోలేదు. షార్ట్ ఫిలిమ్స్‌లో యాక్ట్ చేసేటప్పుడు ‘ఎస్.ఎమ్.ఎస్’ సినిమాకు అవకాశం వచ్చింది. ఆ సినిమా ఫలితాన్ని బట్టి ఇక్కడ ఉండాలా? చదువు కంటిన్యూ చేయాలా? నిర్ణయించుకుందామనుకున్నా. కానీ వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యాను. నంబర్ గేమ్ గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. నాకంటూ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. వాటి ని రీచ్ కావాలనేదే నా ప్రయత్నం.
     
  •  సాయిధరమ్‌తేజ్‌తో నాకు లవ్ ఎఫైర్ ఉన్నట్లు రూమర్లు వస్తున్నాయి. మూడేళ్ల బట్టి ఇండస్ట్రీలో ఉన్నాను. ‘నీ మీద గాసిప్స్ రావడం లేదేంటి’ అని అడిగేవాళ్లు. ఎట్టకేలకు ఈ విధంగానైనా ఒక్క రూమర్ వచ్చింది. నేనేంటో నా ఫ్రెండ్స్‌కీ, ఫ్యామిలీ మెంబర్స్‌కీ తెలుసు.
     
  •  తెలుగులో ఇప్పుడు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అందుకే నా మాతృభాష తమిళం అయినా అక్కడ చేయడం లేదు. అక్కడికి ఓ ఏడాది తర్వాత వెళ్లినా యాక్సెప్ట్ చేస్తారు. అయినా హడావిడిగా రెండు భాషల్లోనూ ఒకేసారి చేయలేను.
     
  •  నాకు సమయం దొరికితే సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొంటా. ప్రస్తుతం ‘టీచ్ ఫర్ ఛేంజ్’, ‘లైఫ్ ఈజ్ బాల్’, ‘ఆదిత్య మెహతా ఫౌండేషన్’ స్వచ్ఛంద సంస్థలకి వర్క్ చేస్తున్నా.
     
  •  క్రిస్మస్ వేడుకలు ఈసారి థియేటర్‌లోనే. న్యూ ఇయర్ మాత్రం నా ఫ్రెండ్ పెళ్లిలో. అందుకు... చెన్నై వెళ్తున్నా.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement