రియల్‌ దండుపాళ్యం

Real Dandupalya Telugu Movie Trailer Release - Sakshi

1980లో కర్ణాటకలో జరిగిన ఓ యథార్థ సంఘటన నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘రియల్‌ దండుపాళ్యం’. రాగిణీ ద్వివేది, మేఘనా రాజ్, దీప్తి, ప్రథమ ప్రసాద్, సంయుక్త హొర్నాడ్‌ ముఖ్య తారలుగా నారాయణ భట్‌ సమర్పణలో మహేశ్‌ దర్శకత్వంలో రూపొందింది. సి.పుట్టుస్వామి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. మహేశ్‌ మాట్లాడుతూ– ‘‘కన్నడలో వచ్చిన ‘దండుపాళ్యం’ చిత్రకథకు, మా ‘రియల్‌ దండుపాళ్యం’ కథకు ఏమాత్రం సంబంధం లేదు.  శ్రీధర్‌ ఈ చిత్రానికి  మంచి మ్యూజిక్‌ ఇచ్చారు’’ అన్నారు. ‘‘ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే చట్ట పరంగా ఎదురైన సమస్య ను ఎలా ఎదుర్కొన్నారు? అన్నదే కథ. ఈ నెలాఖరున విడుదల చేయనున్నాం’’ అన్నారు పుట్టుస్వామి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top